మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు బొమ్మ !

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు బొమ్మ

Last Updated : Jun 6, 2018, 05:11 PM IST
మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు బొమ్మ !
టీమిండియా కెప్టేన్, స్కిప్పర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బుధవారం విరాట్ కోహ్లీ మైనపు బొమ్మను ఆవిష్కరించారు. తన మైనపు బొమ్మ ఆవిష్కరణకన్నా ముందుగా విరాట్ కోహ్లీ తన అభిమానులను అక్కడకు ఆహ్వానించి, తన మైనపు బొమ్మతో సెల్ఫీలు, వీడియోలు తీసుకునే అవకాశం కల్పించి వారిపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. చుట్టూ స్టేడియం బ్యాక్ గ్రౌండ్‌లో సైడ్ వాల్స్ ఏర్పాటు చేయగా మధ్యలో క్రీజులో బ్యాటింగ్ చేస్తోన్న స్టైల్లో ఉన్న విరాట్ కోహ్లీ మైనపు బొమ్మను చూస్తే నిజంగా బ్యాటింగ్ ఫోజులో ఉన్న కోహ్లీని చూసినట్టే అనిపిస్తోంది. 

ఇదిలావుంటే, 2018కిగాను తాజాగా ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న అథ్లెట్స్ జాబితాలో భారత్ తరపున కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు దక్కిన సంగతి తెలిసిందే. 24 మిలియన్ల అమెరికన్ డాలర్లతో విరాట్ కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు.

మొత్తం పురుషులతోనే నిండిన ఈ జాబితాలో భారత్ తరపున విరాట్ కోహ్లీ మాత్రమే ఉండటంతో ఎండార్స్‌మెంట్స్ పరంగా కోహ్లీ ప్రస్తుతం ఎంత క్రేజ్ ఉన్న ఆటగాడో మరోసారి నిరూపితమైంది.

 

 

 

Trending News