Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ (80) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి దాటాక సోమవారం తెల్లవారుఝామున కృష్ణను ఆస్పత్రిలో జాయిన్ చేశారు. మొదట్లో అంత సీరియస్ కాదని, రెగ్యులర్ చెకప్ అని అన్నారు. కానీ ఆ తరువాత కండీషన్ క్రిటికల్ అని, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నామని, గుండెపోటుతో స్పృహలేని స్థితిలో ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు చెప్పారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని, గడిచే ప్రతీ గంటా కీలకమేనని వైద్యులు తెలిపారు.
ఇక మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఘట్టమనేని అభిమానులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఏడాదిలో వరుసగా మూడో విషాదం ఇది. జనవరిలో రమేష్ బాబు మరణిస్తే.. సెప్టెంబర్‌లో ఇందిరమ్మ కన్నుమూశారు. ఇక ఇప్పుడు కృష్ణ అనంత లోకాలకు చేరుకున్నారు. ఇలా మహేష్ బాబుకు దెబ్బ మీద దెబ్బ పడినట్టు అయింది. ఈ విషాదంలోంచి కోలుకోవడం మహేష్ బాబుకు కష్టంగా మారుతోంది.
అయితే సూపర్ స్టార్ కృష్ణ ఎక్కువగా బయటకు రాలేరు. కానీ తన స్నేహితుడు కృష్ణంరాజు మరణించిన సమయంలో వీడియో బైట్ వదిలారు. ఇక పార్దివ దేహాన్ని సందర్శించిన తరువాత మీడియాతో మాట్లాడారు. అవే ఆయన చివరి మాటలు. అభిమానులకు కనిపించిన వీడియోల్లో చివరివి కూడా అవే. అందులో ఆయన ఏం మాట్లాడారంటే..
'తేనే మనసులు సినిమా కోసం ఆర్టిస్టులను సెలెక్ట్ చేసే సమయంలో కృష్ణంరాజు కూడా వచ్చారు. యాభై ఏళ్లు మా స్నేహ ఉంది. చిలకాగోరింక తరువాత నేనంటే నేను సినిమాలో విలన్‌గా నటించాడు. ఆ తరువాత దాదాపు ముప్పై సినిమాల్లో నాతో యాక్ట్ చేశాడు. అతను హీరో అయ్యాక.. అడవి సింహాలు, ఇంద్రభవనం, విక్రమ్, విశ్వనాథ నాయకుడు ఇలా కలిసి చేశాం. అన్నీ సక్సెస్అయ్యాం. ఈ రోజు ఆయన మనల్ని విడిచిపోవడం చాలా బాధాకరం.. నాకు చాలా బాధగా ఉంది' అని అన్నారు.
Also Read : Krishna Passed Away: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం!
Also Read : Krishna Last Movie: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమ ఏమిటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook