కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మరోసారి డీఏ భారీగా పెరగనుంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు పెరగనున్నాయి. అయితే డీఏ ఎప్పటి నుంచి ఎంత పెరుగుతుందనేది పరిశీలిద్దాం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి శుభవార్త ఇది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. ఇప్పుడు 2023 జనవరిలో మరోసారి కరవుభత్యం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర వస్తుధరలు, ద్రవ్యోల్బణం నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. ఇటీవల 4 శాతం పెంచిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ లభిస్తోంది.
పెరగనున్న జీతం
పెరుగుతున్న ధరల నేపధ్యంలో ప్రభుత్వ సిబ్బంది డీఏను పెంచడం ఖాయమైపోయింది. డీఏ పెరగనుండటంతో రానున్న రోజుల్లో ఉద్యోగుల జీతం పెరగనుంది.
జనవరి 2023 నుంచి 42 శాతం కానున్న డీఏ
జూలై 2022 నుంచి ఉద్యోగులకు 38 శాతం కరవుభత్యం చెల్లిస్తున్నారు. ఇప్పుడీ డీఏ మరోసారి పెరగనుంది. అంటే 2023 జనవరి నుంచి ఇంకో 4 శాతం పెరిగి 42 శాతానికి చేరుకోవచ్చని తెలుస్తోంది.
50 శాతానికి పెరిగితే ఏమౌతుంది
కరవుభత్యం నిబంధనల ప్రకారం 2016 లో 7వ వేతన సంఘం అమలు చేసినప్పుడు డీఏను జీరో చేశారు. నిబంధనల ప్రకారం డీఏ 50 శాతానికి చేరుకున్నప్పుడు దానిని జీరో చేస్తారు. 50 శాతం డీఏ చొప్పున ఉద్యోగులకు లభించే డబ్బుల్ని కనీస వేతనంలో చేర్చేస్తారు.
ఎవరైనా ఉద్యోగి బేసిక్ శాలరీ 18 వేల రూపాయలుంటే..50 శాతం డీఏ అంటే 9 వేల రూపాయలు లభిస్తాయి. కానీ 50 శాతం డీఏ చేరిన తరువాత ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో చేర్చి..తిరిగి డీఏను జీరో చేస్తారు. అక్కడ్నించి తిరిగి కౌంటింగ్ ప్రారంభమౌతుంది.
Also read: Marriage Season 2022: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది, నెలరోజుల్లో 32 లక్షల పెళ్లిళ్లు..ఖర్చు ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook