మహారాష్ట్ర: నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ నెల 7న నిర్వహిస్తున్న కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ వెళ్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ వాదిగా ముద్ర పడ్డ ప్రణబ్ తన సిద్ధాంతాలకు విరుద్ధమైన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరౌతుండటం చర్చనీయంశంగా మారింది. దీంతో ఈ కార్యక్రమంలో ప్రణబ్ ఏం మాట్లాడారనేది ఆసక్తిగా నెలకొంది.
పోన్ కాల్స్ వచ్చాయి
ఈ అంశంపై పణబ్ స్పందిస్తూ తాను ఏం మాట్లాడతానో ఆ కార్యక్రమంలోనే వినాలని...అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచన చేశారు. ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించిన తరువాత తనకు ఈ విషయంపై పునరాలోచించుకోవాలని చాలా ఫోన్ కాల్స్, లేఖలు వచ్చాయని ప్రణబ్ పేర్కొన్నారు.
చిదంబరంకు కౌంటర్
బీజేపీతో సంబంధాలుండే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ వెళ్లనుండటం పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్ వాదిగా ఎదిగి..ఆ పార్టీ సిద్ధాలకు వ్యతిరేకంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ప్రణబ్ వైఖరిపై పలువురు కాంగ్రెస్ నేతలు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత చిదంబరం స్పందిస్తూ 'వెళ్లండి.. వారి భావజాలంలో లోపం ఎక్కడుందే చెప్పండి' అని ప్రణబ్ ను ఉద్దేశించి అన్నారు. చిదంబరం వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా..తాను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఏం మాట్లాడుతానో ఆ కార్యక్రమంలోనే వినాలని అప్పటి వరకు ఓపిక పట్టాలని ప్రణబ్ అన్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ రియాక్షన్