Natural Remedies: ప్రస్తుత బిజీ లైఫ్‌లో గ్యాస్ట్రిక్ సమస్య సర్వ సాధారణంగా మారుతోంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎంత సులభంగా తగ్గించవచ్చో..నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరమిది.
చెడు ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం కారణంగా ప్రధానంగా ఎదురయ్యే సమస్య గ్యాస్ట్రిక్. ఇది ఎంత ప్రమాదకరమో అంతే సులభంగా నియంత్రించుకోవచ్చు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు 4 సులభమైన చిట్కాలు మీ కోసం..
నిత్యం వివిధ రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. కడుపు సంబంధిత సమస్యల కారణంగా ఆజీర్ణం మరో సమస్యగా మారింది. చాలా సందర్భాల్లో ఫ్రై పదార్ధాలు, మసాలా పదార్ధాలు తినడం వల్ల 2-3 రోజుల వరకూ గ్యాస్ లేదా అజీర్ణ సమస్య ఎదుర్కోవల్సివస్తుంది. సమస్య మరింతగా పెరిగినప్పుడు కడుపులో ఇబ్బంది కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల్నించి సులభంగా ఉపశమనం పొందేందుకు 4 సులభమైన చిట్కాలు సూచిస్తున్నాం.
అజీర్ణం, గ్యాస్ సమస్యకు చిట్కాలు
తులసి నీళ్లు తాగడం
తులసి హిందూమతం ప్రకారం ఓ పవిత్రమైన మొక్క. ఇందులో అద్భుతమైన ఔషధగుణాలున్నాయి. అజీర్ణం సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగి..అందులో తులసి ఆకులు 4-5 వేయాలి. ఆ తరువాత ఈ నీళ్లను ఉడికించాలి. ఉడికిన తరువాత ఆ నీళ్లను దించి..కొద్దిగా వేడి తగ్గాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే కడుపు పూర్తిగా సెట్ అవుతుంది.
నిమ్మరసం ఉపయోగాలు
నిమ్మరసం కూడా కడుపు సంబంధిత సమస్యలు దూరం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. కడపులో వేడి లేదా అజీర్ణం ఉన్నప్పుడు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే మంచి ఫలితాలుంటాయి ఇలా రోజుకు 2-3 సార్లు చేయాలి. అలాగని మరీ శృతి మించి తాగకూడదు.
యాపిల్ వెనిగర్
అజీర్తి, గ్యాస్ సమస్య దూరం చేసేందుకు యాపిల్ వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లలో 2 స్పూన్ల యాపిల్ వెనిగర్ కలుపుకుని తాగితే బాగుంటుది.
అల్లంతో ప్రయోజనాలు
చలికాలంలో అల్లం అనేది టీలో తప్పకుండా ఉపయోగిస్తారు. అల్లంలో చాలా రకాల ఆయుర్వేద గుణాలుంటాయి. కడుపు సమస్య లేదా గ్యాస్ సమస్య ఉంటే..ఒక కప్పు నీళ్లలో కొద్దిగా అల్లం వేసి ఉడికించాలి. ఆ తరువాత ఈ నీళ్లను తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ నుంచి చాలావరకూ ఉపశమనం లభిస్తుంది. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది.
Also read: Asthma: ఆస్తమా రోగుల డైట్‌లో ఈ పండ్లు ఉంటే...నెలరోజుల్లో ఆ సమస్యకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook