Munugode By-election Result 2022 Live: తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో మెుదలుకానుంది. మునుగోడు మొనగాడెవరో ఎవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. నల్గొండ ఆర్జాలబావిలోని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. మెుత్తం 15 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. దాని కోసం 21 టేబుల్స్ ను సిద్ధం చేశారు. తొలుత పోస్టల్ ఓట్లు తర్వాత ఈవీఎంలు లెక్కిస్తారు.
ఉదయం 9 గంటల కెల్లా ఫస్ట్ రౌండ్ ఫలితం రానుంది. 1,2,3 రౌండ్లలో చౌటుప్పల మండలం, 4,5,6 రౌండ్లలో నారాయణపురం మండలం, 7,8 రౌండ్లలో మునుగోడు ఓట్ల లెక్కింపు జరుగనుంది. 9,10 రౌండ్లలో చండూరు మండలం, 11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గుట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. మునుగోడు ఉపఎన్నికలో 92 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 2,25,192 లక్షల మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడంతో ఏర్పడిన స్థానానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి కుసుకుంట్ల ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరూ రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అధికార పార్టీ వైపే మొగ్గు చూపాయి. అయితే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Munugode Result: ఆ మూడు గ్రామాల ఫలితంపై ఉత్కంఠ.. కేసీఆర్ ను టెన్షన్ పెట్టించిన పోలింగ్ సరళి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook