స్క్రిప్ట్ చదవుడం కాదు..సొంతంగా మాట్లాడాలి - పవన్‌కు మంత్రి సుజయకృష్ణ చురకలు

Last Updated : Jun 2, 2018, 03:25 PM IST
స్క్రిప్ట్ చదవుడం కాదు..సొంతంగా మాట్లాడాలి - పవన్‌కు మంత్రి సుజయకృష్ణ చురకలు

విజయనగరంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని పవన్ చేసిన ఆరోపణలపై జిల్లాకు చెందిన మంత్రి  సుజయకృష్ణ స్పందించారు.తమ జిల్లాలో మైనింగ్‌, ఇసుక మాఫియాలు ఉన్నాయంటూ పవన్ ఆరోపణలు సత్యదూరమన్యారు. ఎవరో చెప్పిన  స్క్రిప్ట్ చదువుతున్న పవన్ .. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుకొని మాట్లాడాలని పవన్ కు మంత్రి సుజయకృష్ణ ఎద్దేవ చేశారు.

హోదా కోసం పవన్ ఏం చేశారు ?

ప్రత్యేక హోదా విషయంలోనూ పవన్ ఇలాగే మాట్లాడుతున్నారని.. దీని కోసం టీడీపీ పోరాడుతున్నది ఆయనకు కనిపించడంలేదా అని మంత్రి సుజయకృష్ణ  ప్రశ్నించారు. హోదా విషయంలో టీడీపీని నిలదీస్తున్న పవన్ ... ఈ నాలుగేళ్లు అందుకోసం  ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం తమ ప్రభుత్వం ప్రకటించిన భృతిని కూడా పవన్‌ తప్పుపడుతున్నారని.. ఇది ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మంత్రి సుజయకృష్ణ  విమర్శించారు. 

ప్రజా పోరు యాత్ర పేరిట పవన్ కల్యాణ్  విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా  పవన్ కల్యాణ్ విజయనగరంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందని.. టీడీపీ పాలనలో ఈ జిల్లా మైనింగ్‌, ఇసుక మాఫియాలు  అడ్డాగా మారిందని పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి సుజయకృష్ణ ఈ మేరకు పవన్ పై ఎదురు దాడికి దిగారు.

Trending News