2022 November Grah Gochar: 3 రోజుల్లో రాశిచక్రం మారనున్న 2 గ్రహాలు... ఈ రాశులకు డబ్బే డబ్బు..

Shukra Budh Gochar 2022: గ్రహ సంచార పరంగా నవంబర్ నెల ఎంతో ముఖ్యమైనది. నవంబర్ రెండో వారంలో 3 రోజుల్లో 2 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఇది 4 రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2022, 07:02 AM IST
2022 November Grah Gochar: 3 రోజుల్లో రాశిచక్రం మారనున్న 2 గ్రహాలు... ఈ రాశులకు డబ్బే డబ్బు..

Shukra Gochar November 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, నవంబర్ నెలలో చాలా ముఖ్యమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. ఇందులో కేవలం 3 రోజుల్లోనే 2 గ్రహ సంచారాలు జరుగనున్నాయి. నవంబర్ రెండో వారంలో అంటే 11వ తేదీన శుక్ర గ్రహం తన రాశిని మార్చి వృశ్చికరాశిలోకి (Venus transit in Scorpio 2022) ప్రవేశిస్తుంది. వెంటనే రెండు రోజుల తర్వాత అదే రాశిలో నవంబర్ 13న, మెర్క్యురీ గ్రహం (Mercury transit in Scorpio 2022) సంచరించనుంది. శుక్రుడు, బుధుడి సంచారం నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృషభం (Taurus): వృషభ రాశి వారికి శుక్ర, బుధుల సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. పెళ్లికానీ యువతీ యువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. ధనలాభం మెండుగా ఉంటుంది.  

సింహం (Leo): బుధ, శుక్రుల రాశిలో మార్పు సింహ రాశి వారికి జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును ఇస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు, కారు కొనే అవకాశం ఉంది. ఆస్తి నుండి లాభం పొందుతారు. వ్యాపారుస్తులు భారీగా ధనార్జాన చేస్తారు. ఉద్యోగులకు ఈ సమయం బాగానే ఉంటుంది. 

మకరం (Capricorn): నవంబర్‌లో జరిగే శుక్ర సంచారం మరియు బుధ సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆఫీసులో సహచరుల సపోర్టు లభిస్తుంది.  

కుంభం (Aquarius): శుక్రుడు మరియు బుధుడి రాశిలో మార్పు కుంభ రాశి వారికి వారి కెరీర్‌లో పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగం పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్ రావచ్చు. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఎన్నో అవకాశాలు పొందే అవకాశం ఉంది. మీరు కొత్త ఇల్లు-కారు లేదా ఏదైనా విలువైన వస్తువును కొనుగోలు చేయవచ్చు. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి.

Also Read: Lunar Eclipse 2022: దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం.. ఈ మూడు రాశులవారి లైఫ్ కష్టాలమయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News