Ceiling Fans: ఇండియాలో 3 రెక్కల సీలింగ్ ఫ్యాన్స్ అధికం, కారణమేంటి

Ceiling Fans: సీలింగ్ ఫ్యాన్. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేదే. అయితే ఈ సీలింగ్ ఫ్యాన్లలో తేడాలున్నాయి. కొన్ని మూడు రెక్కలవి..ఇంకొన్ని నాలుగు రెక్కలవి. ఈ రెండింటికీ తేడా ఏంటి  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 29, 2022, 11:31 PM IST
Ceiling Fans: ఇండియాలో 3 రెక్కల సీలింగ్ ఫ్యాన్స్ అధికం, కారణమేంటి

భారతదేశంలో అత్యధిక శాతం మూడు రెక్కల సీలింగ్ ఫ్యాన్లు అందుబాటులో, వినియోగంలో ఉంటాయి. కానీ అమెరికా వంటి దేశాల్లో మాత్రం నాలుగు రెక్కల సీలింగ్ ఫ్యాన్లు ఎక్కువ. దీనివెనుక ఓ కారణముంది తెలుసా..

చల్లటి గాలి కోసం సీలింగ్ ఫ్యాన్ తప్పనిసరి. చిన్న నిరుపేద నుంచి ధనికుడి వరకూ అందరి ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్ సర్వ సాధారణం. సీలింగ్ ఫ్యాన్లలో ఎక్కువగా మనకు తెలిసింది మూడు రెక్కలు. ఎందుకంటే ఇండియాలో ఇవే ఎక్కువగా ఉపయోగిస్తారు. అదే చలి ఎక్కువగా ఉన్న దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో 4 రెక్కలున్న సీలింగ్ ఫ్యాన్లు అధికంగా ఉపయోగిస్తారు. దీని వెనుక ఉన్న సైన్స్ కారణం. ఆ కారణమేంటో మనం తెలుసుకుందాం..

రెక్కల సంఖ్య వెనుక కారణం

సైన్స్ ప్రకారం సీలింగ్ ఫ్యాన్‌లో రెక్కలు ఎన్ని ఎక్కువగా ఉంటే..గాలి అంత తక్కువగా వీస్తుంది. ఎందుకంటే మోటర్‌పై రెక్కల లోడ్ పడుతుంటుంది. అందుకే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న దేశాల్లో సీలింగ్ ఫ్యాన్ రెక్కలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ రెక్కలుండే ఫ్యాన్లు ఎక్కువ గాలి ఇస్తాయి. అందుకే ఇండియా వంటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో మూడు రెక్కల ఫ్యాన్లు అధికంగా ఉపయోగిస్తారు. రెక్కల సంఖ్య తక్కువగా ఉంటే..ఫ్యాన్ స్పీడ్ పెరిగి గాలి అధికంగా వీస్తుంది.

విదేశాల్లో నాలుగు రెక్కల ఫ్యాన్లు

చల్లని శీతల వాయవులుండే దేశాల్లో ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో 4 రెక్కల ఫ్యాన్లు అధికంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు వేగం తక్కువగా ఉండి..గాలి తక్కువగా వీస్తుంది. శీతల వాయవులు అధికంగా వీచే దేశాల్లో ఎక్కువ రెక్కల సీలింగ్ ఫ్యాన్ల అవసరం ఉంటుంది. అందుకే ఎక్కువగా 4 రెక్కల సీలింగ్ ఫ్యాన్లు వినియోగిస్తారు. రెక్కలు తక్కువైతే..మోటర్‌పై ప్రభావం తక్కువగా పడుతుంది. ఫలితంగా ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుంది. అదే రెక్కల సంఖ్య పెంచితే స్పీడ్ తగ్గిపోతుంది. 

Also read: Weight Loss Tips: అది తాగడం మొదలెడితే...21 రోజుల్లో కొవ్వంతా వెన్న కరిగినట్టు కరగడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News