Horoscope Today October 28 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం!

Horoscope Today: ఈ రోజు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే... మరికొందరికి మిశ్రమ కాలం నడుస్తోంది. ఇవాళ ఎవరి జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 07:06 AM IST
Horoscope Today October 28 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం!

Today Horoscope: మనం సాధారణంగా ఏ పని మెుదలుపెట్టాలన్నా, శుభకార్యం చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా ఆ రోజు జాతకం ఎలా ఉందో చూస్తాం. మరి ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 

మేషం (Aries): వీరికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహారించాలి. మీ బాస్ మీ పనితీరుతో సంతృప్తిపడకపోవచ్చు. గొడవలకు దూరంగా ఉండండి. 
వృషభం (Taurus): ఈ రాశివారికి శుభ సమయం నడుస్తోంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
మిథునం (Gemini): మీరు తలపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో భారీగా లాభపడతారు.  
కర్కాటకం (Cancer): ఈ సమయం మీకు కూడా మిశ్రమంగానే ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. ధనలాభం ఉంటుంది. 
సింహం (Leo): మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. కీలకమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి. మీరు ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. 
కన్య (Virgo): మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీకు లాభాలను ఇస్తుంది. 
తుల (Libra): ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది.  ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీ బాస్ సపోర్టు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. 

వృశ్చికం (Scorpio): ఈ రాశివారు శుభ ఫలితాలు అందుకుంటారు. మీకు ధనలాభం ఉంటుంది. మీరు పదిమందిని ఆకర్షిస్తారు. 
ధనస్సు (Sagittarius): మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. 
మకరం (Capricorn): శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.  మీకు ఇతరుల నుంచి సహాయం అందుతుంది. 
కుంభం (Aquarius): మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. 
మీనం (Pisces): మీరు కష్టపడి పనిచేసినప్పటికీ అనుకూల ఫలితాలు రావు. ఫ్యామిలీ సపోర్టు తీసుకోండి. బంధుమిత్రులతో విబేధాలు తలెత్తవచ్చు. 

Also Read: Shani Remedies: ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి లేదా, ఇలా చేస్తే 21 రోజుల్లో డబ్బే డబ్బు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News