MLA Pilot Rohit Reddy: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్‌లో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొందరు వ్యక్తులు సమావేశమై ప్రలోభ పెట్టేందుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో డబ్బులు ఆఫర్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన సతీశ్ శర్మ అలియాస్ రామచంద్ర భారతిని ఎఫ్ఐఆర్‌లో A1గా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన నందకిశోర్‌ను A2 గా.. తిరుపతికి చెందిన సింహయాజి A3 గా కేసు నమోదు చేశారు. బీజేపీలో చేరితే.. రూ.100 కోట్లు ఇస్తామని సతీష్ శర్మ ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
నందకిశోర్ మధ్యవర్తిత్వంతో సతీశ్ శర్మ, సింహయాజి తమతో మాట్లాడేందుకు వచ్చారని కంప్లైంట్ ఇచ్చారని రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. బీజేపీలో చేరకపోతే.. ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించారని ఫిర్యాదు చేశారని అన్నారు. బీజేపీలో చేరితో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు, సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. తనతోపాటు పార్టీలో చేరే వారికి రూ.50 కోట్లు ఇస్తామని చెప్పినట్లు రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొనుగోలు వ్యవహారం వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డిలతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎపిసోడ్ మొత్తం కేసీఆర్‌కు ఎమ్మెల్యేలు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ఆడియో టేపులను ముఖ్యమంత్రికి ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ప్రెస్‌మీట్ పెడతారని ప్రచారం జరుగుతోంది.
Also Read: Bigg Boss Urfi Javed: బిగ్ బాస్ బ్యూటీకి చిక్కులు.. మితి మీరిన శృంగారగీతం.. ఉర్ఫీ జావెద్‌పై ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook