/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల్లో ఒకటి కొలెస్ట్రాల్. జాగ్రత్త ఉంటే నియంత్రణ ఎంత సాధ్యమో..నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరం. కొలెస్ట్రాల్‌ను దూరం చేసే కొన్ని ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..

మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. రెండవది ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇది చాలా ప్రమాదకరం. ఎల్‌డి‌ఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారి తీస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ తరుణంలో కొంతమంది పరిశోధకులు కొన్ని రకాల ఆహార పదార్ధాల జాబితా విడుదల చేశారు. ఈ ఆహార పదార్ధాలు కొవ్వును కరిగించడమే కాకుండా మీ గుండెను పదికాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చంటున్నారు. 

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహార పదార్ధాలు

కొలెస్ట్రాల్ తగ్గించడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. కూరగాయలు అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రెండవది నట్స్, తృణ ధాన్యాలు. వీటిని ప్రతి నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను తగ్గించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా కొవ్వును కరిగిస్తుంది. 

సోయా బీన్స్

కూరగాయల్లో సోయా బీన్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు మంచి ఫుడ్. ప్రతి రోజూ సోయా ఉత్పత్తుల్ని తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్ తగ్గుతుంది. సాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఈ ఆహార పదార్ధాలతో పాటు ఫైబర్ సప్లిమెంట్స్ తీసుకుంటే మన శరీరంలో సాల్యుబుల్ ఫైబర్ పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ తినే ఆహారంలో ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే..మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో వస్తుంది.

అధిక బరువుకు చెక్

అధిక బరువుకు చెక్ పెట్టేందుకు సోయా బీన్స్ మంచి ఆహారం. ఇందులో ఉండే హై ప్రోటీన్స్ కారణంగా త్వరగా ఆకలి వేయదు. బీన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఇక వెజిటబుల్ ఆయిల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వెజిటబుల్ ఆయిల్స్‌లో అంతగా కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే విటమిన్ ఇ, కేలు చెడు కొవ్వును నియంత్రిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉన్న చేపల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గించుకోవచ్చు. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

Also read: Garlic Side Effects: వెల్లుల్లి మోతాదు మించితే కలిగే దుష్పరిణామాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Cholesterol health precautions and tips to remove bad cholesterol within 21 days, add these foods to your diet
News Source: 
Home Title: 

Cholesterol Tips: ఈ ఆహారం తీసుకుంటే కేవలం 21 రోజుల్లో కొలెస్ట్రాల్‌కు చెక్

Cholesterol Tips: ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే కేవలం 21 రోజుల్లో కొలెస్ట్రాల్‌కు చెక్
Caption: 
Cholesterol tips ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Cholesterol Tips: ఈ ఆహారం తీసుకుంటే కేవలం 21 రోజుల్లో కొలెస్ట్రాల్‌కు చెక్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, October 22, 2022 - 23:28
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
73
Is Breaking News: 
No