Sitrang Cyclone effect on AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24, సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఈనేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 105 మండలాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. తుపాన్ ను ఎదుర్కోనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఏపీ పత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ చెప్పారు. సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 1070, 1800 4250101, 0863 2377118 నెంబర్లకు ఫోన్ చేస్తే తుపాన్ గురించిన సమాచారం చెప్తామన్నారు. ఈ హెల్ప్ లైన్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు.
దూసుకొస్తున్న సిత్రాంగ్ తుపాన్ వల్ల ఏపీకి పెద్దగా ముప్పులేదని ఐఎండీ తెలిపింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ సైక్లోన్ ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఏపీలో పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోకి త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. అక్టోబర్ 25వ తేదీ నాటికి సిత్రాంగ్ తుపాను పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అమెరికా గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ జీఎఫ్‌ఎస్ ముందస్తు సమాచారం ప్రసారం చేసింది. సిత్రాంగ్ తుపాను బాలాసోర్ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ సంస్థ వెల్లడించింది.
Also Read: Police Jobs: ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ, సీఎం జగన్ దీపావళి కానుక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook