సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ చర్మం సడలిపోయి..వృద్ధాప్య ఛాయలు కన్పిస్తూ అంద విహీనంగా కన్పిస్తుంటాం. అయితే ప్రతిరోజూ స్నానం తరువాత ఆ వస్తువు వినియోగిస్తే..నిత్య యవ్వనంతో పాటు అందంగా కన్పిస్తారు.
ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకై వివిధ రకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటాం. అయినా సరే ఆశించిన ఫలితాలుండవు. ముఖ్యంగా చర్మం నిర్జీవంగా, కాంతి విహీనంగా ఉంటుంది. ముఖంపై నిగారింపు లోపిస్తుంది. చాలామందికి స్నానం తరువాత చర్మం డ్రైగా మారుతుంటుంది. ఫలితంగా చర్మం దెబ్బతింటుంది. ఇప్పుడు మేం మీకు చెప్పే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే..ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. చర్మంపై నిగారింపు తెచ్చుకోవచ్చు.
1. స్మానం చేసిన తరువాత మీ చర్మం డ్రైగా మారుతుంటే..తేలిగ్గా తీసుకోవద్దు. దీనివల్ల చర్మం దెబ్బతినే అవకాశాలున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కెందుకు ఓ పద్ధతి ఉంది. స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్ తప్పకుండా రాయడం అలవాటు చేసుకోవాలి. మీ చర్మానికి తగ్గట్టు మాయిశ్చరైజర్ ఎంచుకోవచ్చు.
2. రోజ్ వాటర్ చర్మానికి చాలా ప్రయోజనకరం. ఇది మీ చర్మంలోని వ్యర్ధాల్ని తొలగిస్తుంది. రోజ్ వాటర్ రోజూ వినియోగిస్తే చర్మంపై మంచి కాంతి కన్పిస్తుంది. అంటే జీవం వస్తుంది. మీరు చేయాల్సిందల్లా స్నానం చేసిన తరువాత రోజ్ వాటర్ శరీరానికి అప్లే చేయాలి. బియ్యం నీళ్లు, టోనర్ కూడా రాయవచ్చు.
3. ఎండలో వెళ్లొచ్చిన తరువాత చర్మం నిగారింపు క్రమంగా తగ్గుతుంటుంది. ఈ నిగారింపును తిరిగి సంపాదించేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. స్నానం తరువాత మెడ, గొంతు, చేతులపై సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ చర్మంపై నిగారింపు వస్తుంది.
Also read: Chia Seeds: 30 రోజుల్లో అధిక బరువుకు చెక్, డయాబెటిస్ మాయం, మహిళలకు మరింత అందం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook