చియా సీడ్స్‌ను సూపర్‌ఫుడ్స్‌గా పిలుస్తారు. అంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి ఇందులో. చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మహిళలకు ఎక్కువ లాభాలున్నాయి.
చియా సీడ్స్ మహిళలకు నిజంగానే సూపర్‌ఫుడ్‌లా పనిచేస్తాయి. చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రయోజనాలు అందిస్తాయి. చియా సీడ్స్‌ను డైట్లో బాగంగా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. చియా సీడ్స్ సేవించడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి. చియా సీడ్స్‌తో కలిగే పూర్తి లాభాలు తెలుసుకుందాం..
చియా సీడ్స్ ప్రయోజనాలు
మహిళలకు కేశ సంరక్షణకు చియా సీడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. చియా సీడ్స్‌ను డైట్లో భాగంగా చేసుకుంటే..జుట్టు పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్ సమస్య కూడా పోతుంది. ఎందుకంటే చియా సీడ్స్‌లో ఉండే ఫాస్పరస్ కేశాల్ని కుదుళ్ల నుంచి పటిష్టం చేస్తుంది. అందుకే మహిళలు చియా సీడ్స్ తప్పకుండా తీసుకోవాలి.
ముఖానికి నిగారింపు
చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మహిళల ముఖంపై నిగారింపు వస్తుంది. వీటి వల్ల ముఖ చర్మం హైడ్రైట్‌గా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతాయి. నిత్యం యవ్వనంగా, అందంగా ఉంచుతాయి.
అధిక బరువుకు చెక్
చియా సీడ్స్ ప్రతిరోజూ తీసుకుంటే బరువు పెరగడం ఉండదు. స్థూలకాయం సమస్య పోతుంది. బరువు తగ్గించేందుకు చియా సీడ్స్ అద్భుతంగా దోహదపడతాయి. చియా సీడ్స్ ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టుంటుంది. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, ఎసిడిటీ సమస్య తొలగిపోవడం జరుగుతుంది.
మధుమేహం నియంత్రణ
చియా సీడ్స్ సేవించడం వల్ల మహిళలు, పురుషుల్లో డయాబెటిస్ సమస్య రాదు. ఒకవేళ ఇప్పటికే మధుమేహం సమస్య ఉంటే..మద్యాహ్నం భోజనం తరువాత నానబెట్టిన చియా సీడ్స్ తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook