మలబద్ధకం అనేది తీవ్రమైన సమస్య. రోజూ ఉదయం కడుపు క్లీన్ కాకపోతే పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ ఒక్క సమస్య పలు వ్యాధులకు దారి తీస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలంటే.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, రోజంతా ఒకోచోట కూర్చుని ఉండటం, ఎక్సర్‌సైజ్ లేకపోవడం ఇదంతా కచ్చితంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువగా కడుపు, జీర్ణక్రియపై కన్పిస్తుంది. ఉదయం కడుపు క్లీన్ కాకపోతే కడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్టుండటం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇదే సమస్య రోజూ ఉంటే మాత్రం కచ్చితంగా అది మలబద్ధకమే. సాధారణంగా మలబద్ధకమనేది గర్భిణీ మహిళలల్లో, కొన్ని రకాల మందుల వాడకం కారణంగా ఎదురౌతుంది.
మలబద్ధకం సమస్య ఎలా ఉంటుంది
ప్రపంచవ్యాప్తంగా 20 శాతం మంది మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్క అమెరికాలోనే 20 శాతం జనాభాకు ఈ సమస్య వేధిస్తోంది. అసలు మల బద్ధకం ఎందుకు వస్తుందనేది తెలుసుకోవాలి.
1. ప్రతిరోజూ డైట్‌లో ఫైబర్ పుష్కలంగా లేకపోవడం, పాలు, వెన్న, మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
2. డీహైడ్రేషన్ అంటే శరీరంలో తగినంత నీరు లేకపోవడం, తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల ఎదురౌతుంది.
3. ఎక్సర్‌సైజ్ లేకపోవడం, రోజంతా ఒకేచోట కూర్చుని ఉండటం కూడా ప్రధాన కారణం
4. హై కాల్షియం యాంటాసిడ్స్ లేదా పెయిన్ కిల్లర్స్ మందుల వాడకం వల్ల మలబద్ధకం వస్తుంది.
మలబద్ధకం కారణంగా వచ్చే వ్యాధులు
పైల్స్, పెద్ద ప్రేవుల్లో స్వెల్లింగ్, గ్యాస్ట్రిక్ సమస్య, కడుపు అల్సర్లు, ఇరిటెబుల్ బౌల్ సిండ్రోమ్
మలబద్ధకం దూరం చేసే చిట్కాలు
ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమౌతుంది. దాంతో విసర్జన సులభమౌతుంది. అందుకే డైట్‌లో తృణ ధాన్యాలు, పండ్లు , కూరగాయలు, ఓట్స్, బార్లీ, నట్స్, పప్పులు ఉన్నాయి.
జీలకర్ర, వాము ఉపయోగాలు
ఈ రెండూ మలబద్ధకం సమస్యను దూరం చేసేందుకు దోహదపడతాయి. జీలకర్ర, వామును స్లో ఫ్లేమ్‌పై వేడి చేసి పొడిగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నల్ల ఉప్పు కలపాలి. ఈ మూడు వస్తువులు సమాన మోతాదులో ఉండాలి. రోజూ సగం చెంచా ఈ పౌడర్‌ను గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. మలబద్ధకం సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది.
కిస్మిస్ ఉపయోగాలు
కిస్మిస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనికోసం ప్రతిరోజూ 8-10 కిస్మిస్‌లను రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేచిన తరువాత గింజలు తొలగించి పాలలో కలుపుకుని తాగాలి.
నీళ్లు ఎక్కువగా తాగడం
డీహైడ్రేషన్ సమస్య కారణంగా కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. అందుకే రోజూ తగినంత మోతాదులో నీళ్లు తాగాల్సి ఉంటుంది. నీళ్లకు బదులు లెమన్ వాటర్, కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవచ్చు. రోజుకు 2-3 లీటర్లు అవసరం.
కాఫీ
కాఫీలో ఉండే కెఫీన్ అనేది ప్రేవుల్ని ఉత్తేజితం చేస్తుంది. ఫలితంగా బౌల్ మూమెంట్ బాగుంటుంది దాంతోపాటు కాఫీలో ఉండే కరిగే గుణమున్న ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది.
Also read: Weight Loss Diet: రోజూ తినే గోధుమ రొట్టెలకు బదులు ఇది చేర్చండి, 3 వారాల్లో అధిక బరువుకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook