Vanitha Vijayakumar : దేవుడు అన్నీ చూస్తుంటాడు.. కాలమే సమాధానం.. వేదాంతం వల్లిస్తోన్న వనిత విజయ్ కుమార్

Vanitha Vijayakumar  Quotes తమిళ నటి వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి అందరికీ తెలిసిందే. ఆమె వేసే ట్వీట్లన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2022, 02:40 PM IST
  • నెట్టింట్లో వనిత విజయ్ కుమార్ సందడి
  • వేదాంతం వల్లించిన కోలీవుడ్ కాంట్రవర్సీ నటి
  • బిగ్ బాస్ షోతో మళ్లీ బిజీగా మారిన వనిత
Vanitha Vijayakumar  : దేవుడు అన్నీ చూస్తుంటాడు..  కాలమే సమాధానం.. వేదాంతం వల్లిస్తోన్న వనిత విజయ్ కుమార్

Vanitha Vijayakumar : కోలీవుడ్ నటి వనిత విజయ్ కుమార్ చేసే హంగామా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వనిత ఎక్కువగా తన పర్సనల్ విషయాలతోనే ఫేమస్ అవుతుంటుంది. కరోనా కంటే ముందు వనిత మూడో పెళ్లి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. పీటర్ పాల్ వనితల మూడో పెళ్లి ఎక్కువ రోజులు కూడా సాగలేదు. వెంటనే అది విడాకులకు దారి తీసింది. ఈ మూడో పెళ్లి చుట్టూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

అయితే ఇప్పుడు మాత్రం వనిత నాలుగో పెళ్లి మీద చర్చలు జరుగుతుంటాయి. నాలుగు కాకపోతే నలభై చేసుకుంటాను మీకు ఎందుకు అన్నట్టుగా రూమర్ల మీద వనిత స్పందించింది. కానీ నాలుగో పెళ్లి మీద వనితకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు. వనిత ఇప్పుడు బుల్లితెర, సోషల్ మీడియా అంటూ బాగానే బిజీగా ఉంటోంది. బిగ్ బాస్ షో మీద నానా ఆరోపణలు చేసిన వనిత.. ఇప్పుడు ఆ షో మీద తన యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటూ ఉంటోంది.

నెట్టింట్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వనిత తాజాగా వరుస ట్వీట్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవుడు, కాలం, పశ్చాత్తాపం అంటూ ఇలా ఏవేవో మాట్లాడేసింది. 'ఆ దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం మన చుట్టూ ఉన్న వాళ్లని మోసం చేయొచ్చు.. విషయాలను దాచొచ్చు.. అబద్దాలు ఆడొచ్చు.. పక్కవారి సొమ్మును కాజేయొచ్చు.. కానీ మన మీద ఆ పైన ఓ శక్తి ఉంటుంది.. అంతా గమనిస్తుంటుంది. 

 

శత్రువులను మన్నించే క్షమించే మంచి మనసున్నవారిని ఆ దేవుడు కాపాడుతుంటాడు..  అయితే అన్ని తప్పులు నువ్ చేసుకుంటూ వస్తూ.. ఇలా నాకు ఎందుకు జరుగుతోంది.. నాకే ఈ బ్యాడ్ లక్ ఏంటి..  ఆ దేవుడేంటి నాకు సపోర్ట్ ఇవ్వడం లేదంటే మీరు పాపాలు చేసినట్టు లెక్క. కాలమే అన్నింటికి సమాధానాలు చెబుతుంది. కానీ ఆ టైంకి మీరు పశ్చాత్తాపడటం లేట్ అవుతుంది.. ఇదే ఎవరినో బాధ పెట్టేందుకు చెప్పడం లేదు.  పచ్చి నిజాలు అని చెబుతున్నాను..  మార్పు చెందడానికి, మంచిగా మారేందుకు ఎప్పుడూ వెనుకడుగు వేయకండి.. ఆ దేవుడు అంతా చూస్తున్నాడు'  అంటూ వేదాంతాన్ని వల్లించింది. 

Also Read : Ponniyin Slevan Fake Collections : ఉమైర్ సంధు ట్వీట్లపై నెటిజన్ల ఫైర్

Also Read : Sai Rajesh Baby Movie : కొత్త కారుతో సాయి రాజేష్ జోరు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News