Sarkaru Vaari Paata TRP Ratings : మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సర్కారు వారి పాట. మిక్స్డ్ రివ్యూలతో సర్కారు వారి పాట బాగానే ఆడింది. అయితే లాంగ్ రన్‌లో ఈ సినిమా చివరకు నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తోంది. కొన్ని ఏరియాల్లో డబ్బులను పూర్తిగా రికవరీ చేయలేదని, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను తెచ్చిపెట్టిందనే టాక్ ఉంది. మొత్తానికి సర్కారు వారి పాట భారీ అంచనాల నడుమ రిలీజై యావరేజ్ చిత్రంగా నిలిచింది. మంచి పాయింట్‌ను ఎత్తుకున్న పరుశురామ్.. కమర్షియల్ అంశాల పేరిట కూనీ చేశాడని అందరూ అన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడం, జనాల మీద బ్యాంకింగ్ వ్యవస్థ దోపిడి ఎలా ఉందో చూపిస్తూ సర్కారు వారి పాటను తీశారు. కానీ రొటీన్ కథ, కథనాలతో సినిమాను నడిపించడంతో తేడా కొట్టేసింది. మహేష్ బాబు యాక్టింగ్ వరకు ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కళావతి కారెక్టర్లో కీర్తి సురేష్‌ను చూసి చాలా మంది పెదవి విరిచారు. ఇలాంటి పాత్రను ఎందుకు చేశావ్ అంటూ కీర్తి సురేష్‌ను అభిమానులు నిలదీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రోలింగ్‌కు గురైంది.
అలా చివరకు సర్కారు వారి పాట సిల్వర్ స్క్రీన్ మీద యావరేజ్‌గా నిలిచింది. బుల్లితెరపై మహేష్ బాబు తన స్టామినాను చాటుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ బుల్లితెరపై చాలా పేలవమైన టీఆర్పీ రేటింగ్ సాధించింది. అది జెమినీ టీవీలో వేయడం, ఆరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ రావడం వల్లే టీఆర్పీరేటింగ్ తక్కువగా వచ్చిందని మహేష్‌బాబు అభిమానులు అంటున్నారు.
హెచ్‌డి ప్లస్ ఎస్‌డి 11.1 కాగా.. టోటల్ రేటింగ్.. 9.45 వచ్చింది. అయితే ఇది భీమ్లా నాయక్ కంటే కాస్త ఎక్కువగానే ఉంది. ఈ ఏడాదిలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రేటింగ్ 20 దాటలేకపోయింది. కేజీయఫ్ చాప్టర్ 2 పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజే టిల్లు, కొండపొలం, పుష్ప మూడో సారి ఇలా అన్ని చిత్రాలకు సర్కారు వారి పాట ప్రీమియర్స్ కంటే ఎక్కువగా వచ్చిందంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక బిచ్చగాడు దాదాపు 18 రేటింగ్ వచ్చిందంటూ మహేష్ బాబుని ట్రోల్ చేస్తున్నారు.
Also Read : మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి!
Also Read : Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook