PM Kisan Latest Update: రైతులకు అండగా ఉండే క్రమంలో పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలకు అందిస్తున్నారు. ఇటీవల 11వ విడతలో భాగంగా రూ.2 వేలను రైతుల ఖాతాలో కేంద్రప్రభుత్వం జమ చేసింది. త్వరలో 12వ విడత సొమ్ము సైతం జమ కానుంది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. దీని వల్ల దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ నెంబర్ గానీ, ఫోన్ నెంబర్ ద్వారా గానీ రైతుల లావాదేవీల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కానీ తాజా మార్పులతో ఆధార్ నెంబర్‌తో రైతుల స్థితి చూసే అవకాశం లేదు. ఇప్పుడు స్టేటస్ చూడాలంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి చేశారు. గతంలో రైతులు ఆధార్, మొబైర్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకునే వారు. ఆ తర్వాత మొబైల్ నెంబర్ కాకుండా ఆధార్ చూడవచ్చని అధికారులు తెలిపారు.
తాజాగా కొత్త నిబంధనలతో ఆధార నెంబర్‌తో పనిలేకుండా ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు తెలుసుకునే వీలు ఉంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో వివరాలు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
* మొదట pmkisan.gov.inకు వెళ్లాలి.
* పోర్టల్‌లో ఎడమ వైపు ఉన్న చిన్న బాక్సులో లబ్ధిదారుని స్థితిపై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
* ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేయడం ద్వారా రైతు స్థితి తెలుసుకోవచ్చు.
* రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే..రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకునేందుకు ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి.
* పీఎం కిసాన్ ఖాతాతో రిజిస్ట్రర్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత ఫోన్‌కు వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి.
* దీంతో రిజిస్ట్రేషన్ నెంబర్, పేరు ఓపెన్ అవుతుంది.
Also read:TRS VS BJP: కేంద్రానికి కేటీఆర్ థాంక్స్.. హరీష్ రావు సెటైర్స్ .. అసలు ఏంటీ మేటర్!
Also read:TS Govt: తెలంగాణలో వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ప్రభుత్వం కీలక నిర్ణయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి