Manchu Vishnu Alleges an Actor Hired 21 Employees to Troll Him: సినీ నటుడు మోహన్ బాబు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు తన కెరీర్ లో ఢీ, దేనికైనా రెడీ వంటి ఒకటి రెండు సినిమాలు తప్ప మరో హిట్ అందుకోలేకపోయాడు. గత ఏడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో దిగిన ఆయన తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి బలపరిచిన ప్రకాష్ రాజును ఓడించి అధ్యక్ష పదవి చేపట్టారు.
అయితే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మంచు విష్ణుని సోషల్ మీడియాలో దారుణంగా టోల్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ వెనుక ఎవరో ఉన్నారని, ప్రస్తుతం తన ద్రుష్టి అంతా సినిమాల మీదే ఉందని మంచు విష్ణు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు. కానీ ఆ తర్వాత ఈ విషయం సద్దుమణిగింది. అయితే మంచు విష్ణు నిర్మాణంలో మోహన్ బాబు హీరోగా రూపొందిన సన్ ఆఫ్ ఇండియా సినిమా రిలీజ్ అయిన సమయంలో సినిమా మీద కూడా భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ఈ విషయంలో మంచు విష్ణు అప్పట్లో తమను ఎవరు ట్రోల్ చేసినా లీగల్ గా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియా నెటిజన్లు పట్టించుకోలేదు. కానీ మంచు అప్పట్లో సైబర్ క్రైమ్ కి ఈ విషయం మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.. ప్రస్తుతానికి మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా వాస్తవానికి అక్టోబర్ 5వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, అక్కినేని నాగార్జున ది గోస్ట్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తన సినిమాను వాయిదా వేసుకుంటూ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయిస్తూ ఒక ప్రెస్ మీట్ లాంటిది నిర్వహించి ప్రకటించారు. సాధారణంగా ప్రెస్ మీట్లకు మీడియాను ఆహ్వానిస్తూ ఉంటారు కానీ మంచు విష్ణు ఈ సమావేశానికి మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులను ఆహ్వానించాడు.
సోషల్ మీడియాలో మీమ్ పేజెస్ నిర్వహించే వారికి కూడా ఆహ్వానాలు పంపారు. ఆహ్వానాల పంపడమే గాక తనను ఎవరు టార్గెట్ చేసి టోల్ చేస్తున్నారనే విషయం మీద ఈ ప్రెస్ మీట్లో ఆయన కాస్త ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాము ఫిర్యాదు చేసిన తర్వాత తన మీద వస్తున్న ట్రోలింగ్స్ లో 85% రెండే ఐపి అడ్రస్‌ల నుంచి వస్తున్నాయని అందులో ఒక ఐపి అడ్రస్ జూబ్లీహిల్స్ లోని ఒక ప్రముఖ నటుడి నివాసం కాగా మరొకటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ లోని ఒక ఐటీ ఆఫీస్ అని చెప్పుకొచ్చారు.
ఆ ఐటీ ఆఫీస్ లో తనను ట్రోల్ చేయడం కోసం, తన కుటుంబాన్ని టోల్ చేయడం కోసం సుమారు 21 మంది ఐటీ ఎంప్లాయిస్ ని నియమించుకున్నారని మంచు విష్ణు ఆరోపించారు. అయితే సదరు నటుడు ఎవరనే విషయాన్ని ఇప్పుడు చెప్పనని శుక్రవారం నాడు నిర్వహించే ప్రెస్మీట్లో ఆ విషయాన్ని బయట పెడతానని ఆయన అన్నారు. కేసు ప్రస్తుతానికి కోర్టులో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకన్నా ఏమీ మాట్లాడలేనని ఆయన కామెంట్ చేశారు.
అయితే గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మంచు విష్ణు వర్సెస్ నాగబాబు అన్నట్లుగా ప్రెస్ మీట్లు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు ట్రోల్ చేయించింది నాగబాబేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు ఇలా చిన్న విషయానికి ఉద్యోగస్తులను నియమించి మరియు ట్రోల్ చేయిస్తారా ? అది ఆయన అయి ఉండదు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ విషయంలో ఏం జరిగింది తనను ట్రోల్ చేయించిన హీరో లేదా నటుడు ఎవరు అనే విషయాన్ని మంచు విష్ణు బయట పెడితే గాని పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Jabardasth Comedian Murthy: జబర్దస్త్ కమెడియన్ మూర్తి మృతి.. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తోనే!
Also Read: Bimbisara OTT: ఓటీటీలోకి కల్యాణ్ రామ్ 'బింబిసార'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook