Taniya Bhatia Bag: భారత మహిళా క్రికెట‌ర్‌ తానియా భాటియాకు చేదు అనుభవం.. అగంతకుడు రూమ్‌లోకి దూరి..!

Indian Star Taniya Bhatia bags Robbed In London. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియా‌కు చేదు అనుభవం ఎదురైంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 27, 2022, 09:11 AM IST
  • మహిళా క్రికెట‌ర్‌ తానియా భాటియాకు చేదు అనుభవం
  • అగంతకుడు రూమ్‌లోకి దూరి..
  • ఈసీబీపై తీవ్ర ఆగ్రహం
Taniya Bhatia Bag: భారత మహిళా క్రికెట‌ర్‌ తానియా భాటియాకు చేదు అనుభవం.. అగంతకుడు రూమ్‌లోకి దూరి..!

Team India wicketkeeper Taniya Bhatia bag robbed in London: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియా‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అగంతకుడు తానియా గదిలోకి దూరి ఆమె బ్యాగును ఎత్తుకెళ్లాడు. అందులో డబ్బు, కార్డులు, వాచీతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని తానియా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. హోటల్ మేనేజ్‌మెంట్‌, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై భారత వికెట్ కీపర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

'లండన్‌ మారియట్‌ హోటల్ మేనేజ్‌మెంట్‌ తీరు నన్ను షాక్‌కు గురి చేసింది. నేను గత కొన్ని రోజులుగా ఇక్కడే బస చేశా. నేను రూంలో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నా బ్యాగు దొంగిలించారు. ఇందులో డబ్బు, కార్డులు, వాచీ, నగలు కూడా ఉన్నాయి. ఇక్కడ సురక్షితంగా లేదు. వెంటనే విచారణ చేపట్టి.. నా బ్యాగును తిరిగి అందిస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అస్సలు అనుకోలేదు. వాళ్లు కూడా జాగ్రత్తపడతారని అనుకుంటున్నా' అంటూ తానియా భాటియా‌ వరుస ట్వీట్లు చేసింది.

మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్ళింది. ఇంగ్లీష్ గడ్డపై అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది. దాంతో లెజండరీ ప్లేయర్ జులన్ గోస్వామికి ఘన వీడ్కోలు పలికింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ అయిన తర్వాత తానియా భాటియా‌ బ్యాగ్ పోవడంతో.. ఎవరో కావాలనే ఈ పనికి పాల్పడి ఉంటారని అభిమానులు అంటున్నారు. టీమిండియా గెలవడాన్ని తట్టుకోలేక ఇంగ్లండ్ అభిమానులు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. 

Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీని ప్రకటించిన గులాం నబీ ఆజాద్, పార్టీ జెండా ఇదే..

Also Read: అక్టోబర్‌లో రాశిని మార్చబోతున్న ఆరు గ్రహాలు.. ఈ 6 రాశులవారిపై పెను ప్రభావం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News