Benefits Of Walnuts: వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వాల్‌నట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకుంటే శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మెదడును మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఇది థైరాయిడ్ వంటి సమస్యలను తొలగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ వంటి సమస్యలను తొలగించడం దోహదపడుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఇతర ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనం తెలుసుకుందాం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. దీనివల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఉండే పాలీఫెనాల్ ఎలాజిటానిన్‌లు క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
ఎముకలను బలపరుస్తాయి:
రోజూవాల్‌నట్స్ తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాల బలంగా దృఢంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఎముకల బలాన్ని పెంచుతుంది.
బరువు తగ్గించడానికి సహాయపడుతుంది:
నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల పెరుగుతున్న శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. ఇందులో ఉండే ప్రొటీన్లు అధిక బరువును తగ్గిస్తాయి. ఇదే సమయంలో కేలరీలను తగ్గిస్తాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తాయి:
వాల్‌నట్స్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook