Devi Navaratri 2022: నవరాత్రుల్లో ఈ మొక్కలను నాటితే.. మంచి ఫలితాలు పొందుతారు..

Devi Navaratri 2022: తెలుగు రాష్ట్రాల వారికి శరన్నవరాత్రులు చాలా పవిత్రమైనవి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ నవరాత్రుల్లో భక్తులంతా ఎంతో పవిత్రంగా అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా ఏదైనా శుభకార్యం చేసేందుకు ఇవి మంచి రోజులుగా చెప్పొచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2022, 05:28 PM IST
  • నవరాత్రుల్లో ఈ మొక్కలను నాటండి..
  • అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి
  • మంచి ఫలితాలు పొందుతారు
Devi Navaratri 2022: నవరాత్రుల్లో ఈ మొక్కలను నాటితే.. మంచి ఫలితాలు పొందుతారు..

Devi Navaratri 2022: తెలుగు రాష్ట్రాల వారికి శరన్నవరాత్రులు చాలా పవిత్రమైనవి. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ నవరాత్రుల్లో భక్తులంతా ఎంతో పవిత్రంగా అమ్మవారిని పూజిస్తారు. అంతేకాకుండా ఏదైనా శుభకార్యం చేసేందుకు ఇవి మంచి రోజులుగా చెప్పొచ్చు. ఈ క్రమంలో అమ్మవారికి ఇష్టమైన ఏదైనా పూల మొక్కను ఇంట్లో నాటితే సిరిసంపదలు లభించడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే నవరాత్రుల్లో భాగంగా ఎలాంటి మొక్కలను నాటితే ఈ ప్రయోజనాలు లభిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

 శంకు పుష్పాల మొక్క:
మనం తరచుగా మన పొలాల్లో లేదా ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కలను చూస్తూ ఉంటాం. ఈ మొక్కల యొక్క పువ్వులు నీలిరంగులో ఉంటాయి. ఇవి శివునికి ఎంతో ఇష్టమైన పువ్వులుగా భావిస్తారు. అయితే నవరాత్రులలో ఈ మొక్కను తీసుకువచ్చి ఇంట్లో నాటుకోవడం వల్ల సిరిసంపదలు లభించడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. అంతేకాకుండా ఇంట్లో సమస్యలు కూడా దూరం అవుతాయని.. సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఇంట్లో ఈ మొక్కను నాటుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అరటి మొక్క:
భారతదేశ ప్రజలందరూ వీటిని శుభకార్యాలకు వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది వీటిలో ఆహారం తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉంటారని భక్తులు భావిస్తారు. అయితే నవరాత్రులలో ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా జీవితంలో ఆనందం కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది.  అయితే తొమ్మిది రోజుల నవరాత్రుల్లో భాగంగా ఈ అరటి ఆకుల్లో పాలతో వండిన నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

తులసి మొక్క:
 హిందూ సాంప్రదాయంలో తులసి మొక్క ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇందులో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుందని హిందువులు ప్రజలు నమ్ముతుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవరాత్రుల్లో భాగంగా ఈ మొక్కను ఇంటి ముందు నాటితే ఇంట్లో శుభాలు జరగడమే కాకుండా దుష్ట శక్తులు ఉంటే పారిపోతాయని శాస్త్రం తెలిపింది. నవరాత్రుల్లో భాగంగా తులసి తో అల్లిన మాలను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని శాస్త్రం పేర్కొంది.

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Blood Purifying Foods: ఈ ఆహారాలను తీసుకోండి.. రక్తాన్ని శుద్ధి చేసి అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News