LOW BP Reasons: హై బ్లడ్ ప్రెషర్ ఎంత ప్రమాదకరమో..లో బ్లడ్ ప్రెషర్ కూడా అంతే డేంజర్. మీ బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా తగ్గిపోతే..కొన్ని సులభమైన చిట్కాలతో దూరం చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
అధిక రక్తపోటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. బ్లడ్ ప్రెషర్లో ఏమాత్రం సమస్య తలెత్తినా అప్రమత్తం కావల్సి ఉంటుంది. అయితే అధిక రక్తపోటులానే లో బ్లడ్ ప్రెషర్ కూడా చాలా ప్రమాదకరం. ఆరోగ్యకరమైన శరీరానికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు 120/80. మీ బ్లడ్ ప్రెషర్ 90/60mm Hgకు పడిపోయిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా మనిషి ప్రాణం కూడా పోవచ్చు. అంత ప్రమాదకరమిది. అందుకే తేలిగ్గా తీసుకోకూడదు.
బ్లాక్‌సాల్ట్
లో బీపీ సమస్యను దూరం చేసేందుకు బ్లాక్‌సాల్ట్ అనేది చాలా మంచిది. బ్లాక్‌సాల్ట్ అనేది లో బ్లడ్ షుగర్ సమస్యను తగ్గిస్తుంది. బ్లాక్‌సాల్ట్‌ను అంటే రాక్‌సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇందులో లిథియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, మినరల్స్ ఉంటాయి. బ్లాక్‌సాల్ట్ చలవచేసే తత్వం కారణంగా..ఆరోగ్యపరమైన సమస్యలు దూరమౌతాయి.
బ్లాక్సాల్ట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఇవి బ్లెడ్ ప్రెషర్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. రాక్సాల్ట్లో పొటాషియం అధికంగా ఉండటంతో బ్లెడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. నీళ్లలో కొద్దిగా అంటే 2.5 గ్రాముల ఉప్పు కలుపుకుని తాగితే బ్లెడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.
లో బ్లడ్ ప్రెషర్ లక్షణాలు, కారణాలు
బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలుంటాయి. నాలుక అదోలా ఉంటుంది. అలసట, అశాంతి, చికాకు ఉంటాయి. రక్త ప్రసరణలో సమస్య లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. డీహైడ్రేషన్, వీక్నెస్ కూడా కారణాలు. డయాబెటిస్, థైరాయిడ్ వంటి వ్యాధుల వల్ల జరగవచ్చు. గుండెకు సంబంధించిన వ్యాధుల మందుల వల్ల కూడా ఇలా జరుగుతుంది.
లో బ్లడ్ ప్రెషర్ కారణాల్లో డీహైడ్రేషన్ ఒకటి. డీహైడ్రేషన్ దూరం చేసేందుకు తగిన మొత్తంలో నీళ్లు తాగాల్సి ఉంటుంది. మరోవైపు కొన్ని రకాల మందుల్ని తీసుకోకూడదు. బ్లడ్ ప్రెషర్ నియంత్రించేందుకు కార్బోహైడ్రేట్లు ఉండే భోజనం తీసుకోవాలి కానీ అధిక కార్బోహైడ్రేట్లుండే రొట్టెలు, పాస్తా, బంగాళదుంప, బియ్యం దూరం చేయాలి.
Also read: Malaria Home Remedies: పెరుగుతున్న మలేరియా ముప్పు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook