Budh Margi In Virgo 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం కన్యారాశిలో తిరోగమనంలో ఉన్న బుధుడు.. అక్టోబరు 2న ప్రత్యక్ష సంచారంలోకి వస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. సాధారణంగా బుధుడిని శుభగ్రహంగా భావిస్తారు. బుధుడు మార్గంలో (Budh Margi In Virgo 2022) ఉండటం వల్ల ఏ రాశివారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
మేషరాశి (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశిలోని మూడవ మరియు ఆరవ గృహాలకు బుధుడు అధిపతి. బుధుడి యెుక్క ఈ సంచారం మేషరాశి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆఫీసులో ఎవరైనా శత్రువులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. ఉద్యోగస్థులకు ఈ సమయం కొద్దిగా కలిసి వస్తుంది.
కర్కాటకం (Cancer)- ఈ రాశిచక్రం యొక్క మూడవ ఇంట్లో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఎదుటి వ్యక్తి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఆఫీసులో అప్రమత్తంగా ఉండండి,లేకపోతే చిక్కుల్లో పడతారు.
సింహం (Leo)- ఈ రాశి యెుక్క రెండవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి బుధుడు. ఈ సమయంలో ఈ వ్యక్తులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మెర్క్యురీ మార్గం కారణంగా వీరి యెుక్క కుటుంబ జీవితంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఏదైనా విషయంలో వివాదాలు రావచ్చు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు నష్టాలను చవిచూస్తారు.
Also Read: Shukra Gochar 2022: కన్యారాశిలోకి శుక్రుడు.. శనిదేవుడి అనుగ్రహంతో ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook