Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఉపరితల ఆవర్తనం..వాయవ్య, దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైంది. ఇటు వాయవ్య, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.
రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు కదలనుంది. వీటి ప్రభావంతో తెలంగాణలో రాగల మూడురోజులపాటు వానలు పడనున్నాయి. రాగల మూడురోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఎల్లుండి మరికొన్నిప్రాంతాల్లో ఇదే వాతావరణం కనిపించనుంది. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురవనున్నాయి.
మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ..వెదర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అల్పపీడనం ప్రభావం అధికంగా ఉంది. వాయవ్య, దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమయ్యిందని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు వెల్లడించాయి. రేపటిలోపు అల్పపీడనం మరింత బలపడుతుందని స్పష్టం చేసింది.
ఆ తర్వాత వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు వెళ్లనుంది. అల్పపీడనంతోపాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.వాయవ్య, దాని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు ఏపీలో వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం ప్రభావం కోస్తాంధ్రపై అధికంగా ఉంది. కోస్తాంధ్రలో రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.తీరం వెంట వాతావరణం కల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంట పెనుగాలులు వీస్తాయని..ఈసమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రాగల మూడురోజులపాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజల సైతం జాగ్రత్తగా ఉండాలని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు సూచించాయి. ఇటు రాయలసీమలోనూ వానలు పడే అవకాశం ఉంది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండనున్నాయి.
Also read:Sujana Chowdary: టీడీపీలోకి సుజనా చౌదరి రీ ఎంట్రీ? ఆ నలుగురికి బీజేపీలో అన్ని అవమానాలేనట!
Also read:ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న అల్పపీడన ముప్పు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన
ముంచుకొస్తున్న అల్పపీడనం
లెటెస్ట్ వెదర్ రిపోర్ట్