Vishwakarma Puja 2022: ఆశ్వినీ మాసంలోని కృష్ణపక్షం అష్టమి రోజున విశ్వకర్మ పూజను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున పనిముట్లను పూజిస్తారు. విశ్వకర్మను (Vishwakarma Puja 2022) ప్రపంచంలోనే మెుదటి ఇంజినీర్ గా భావిస్తారు. ఎందుకంటే దేవతల ఆయుధాలను, బ్రహ్మ కమండలం, విష్ణువు యొక్క సుదర్శన చక్రం, శివుని త్రిశూలం, పుష్పక విమానం అన్నింటినీ విశ్వకర్మే తయారు చేశారని చెబుతారు.
పూజా ముహూర్తం
విశ్వకర్మ పూజను ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. ఈ రోజున శుభ సమయం ఉదయం 7.36 గంటలకు ప్రారంభమయ్యే రాత్రి 9.38 వరకు ఉంటుంది. విశ్వకర్మ పూజ రోజున ఉదయం 11.51 నుండి 12.40 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది.
విశ్వకర్మ పూజా విధానం
విశ్వకర్మ పూజ రోజున కర్మాగారాల్లో యంత్రాలు, పనిముట్లకు పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఆయుధాలను కూడా పూజిస్తారు. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి.. మీ ఫ్యాక్టరీకి లేదా దుకాణానికి వెళ్లండి. అక్కడ పసుపు వస్త్రాన్ని పరచి, గంగాజలం చల్లి విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. దీని తరువాత విశ్వకర్మ విగ్రహానికి రోలి మరియు అక్షత వేయండి. అప్పుడు దేవుడికి పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టండి.
Also Read: Grah Gochar in 2022: రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి లక్కే లక్కు... ఇక వీరికి తిరుగుండదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook