బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వాజూభాయ్ వాలా కర్ణాటక సీఎంగా యడ్యూరప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటకకు 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు యెడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ అనంతరమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యెడ్యూరప్ప చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, బలాన్ని నిరూపించుకుంటామని బీజేపీ నేత అనంతకుమార్ తెలిపారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌లు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
#WATCH Live from Bengaluru: BS Yeddyurappa takes oath as Karnataka Chief Minister https://t.co/8wqUptkkvV
— ANI (@ANI) May 17, 2018
#Bengaluru: BJP's BS Yeddyurappa takes oath as the Chief Minister of Karnataka. pic.twitter.com/f33w4GZjrS
— ANI (@ANI) May 17, 2018
Bengaluru: BJP's BS Yeddyurappa shows the victory sign after being sworn-in as Chief Minister of Karnataka. pic.twitter.com/UMM10wQKbY
— ANI (@ANI) May 17, 2018
కర్ణాటక సీఎంగా బీజేపీ నేత యడ్యూరప్ప మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప 2007, 2008లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకూ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన యడ్యూరప్ప 1983లో తొలిసారి శికారిపురానుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1988 నాటికి కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడయ్యారు. 1994లో విపక్ష నేతగా ఉన్నారు. 1970లో శికారిపుర యూనిట్‌కు రాష్ట్రీయ స్వంయంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడుటలో యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభమైంది.
వ్యక్తిగత జీవితం
యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనాకెరెలో సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించారు. ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 1965లో సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు.యడ్యూరప్ప 1967లో మైత్రిదేవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమారైలు. 2004లో భార్య ప్రమాదావశాత్తు మరణించింది.