Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర పెరిగిందంటే..

Gold Price Today September 7th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4690గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5116గా ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 7, 2022, 10:00 AM IST
  • వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం ధరలు
    22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.150 మేర పెరిగిన ధర
    24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.160 మేర పెరిగిన ధర
Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత ధర పెరిగిందంటే..

Gold Price Today September 7th 2022 : వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. నిన్న (సెప్టెంబర్ 6) రూ.160 మేర పెరిగిన బంగారం ధర ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160 మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్ సహా ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలలో ఒకే ధరలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ మూడు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,820గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,200గా ఉంది.

మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,190గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24  క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది. 

గడిచిన 10 రోజుల్లో 4 సార్లు తగ్గిన బంగారం ధర 4 సార్లు పెరిగింది. పెరిగిన ధరతో పోలిస్తే తగ్గిందే ఎక్కువ. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర బలహీనపడినందునా భారత్‌లోనూ ధర తక్కువగానే ఉంది. ఈ నెలాఖరు నాటికి బంగారం ధర మరింత దిగొచ్చే సూచనలు ఉన్నాయి. సాధారణంగా బంగారం ధరలపై జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా వివిధ నగరాల్లోని ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించగలరు. బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ కచ్చితమైన ధర కోసం నేరుగా స్థానిక జ్యువెలరీ వ్యాపారులను సంప్రదించండి. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, డాలరుతో రూపాయి మారకం విలువ, దేశాల మధ్య సంబంధాలు తదితర కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి.

Also Read: NEET UG 2022 Result: నేడే నీట్ యూజీ 2022 ఫలితాలు... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి...

Also Read: Horoscope Today September 7th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారి కెరీర్‌లో ఇవాళ కీలక పరిణామం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News