Mahalaya Amavasya 2022: పితృ పక్షం సెప్టెంబర్ 10న ప్రారంభమై... మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పితృ పక్షంలో (Pitru Paksha 2022) శ్రాద్ధ కర్మలు చేస్తారు. ఈ మహాలయ అమావాస్యనే (Mahalaya Amavasya 2022) సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య 25 సెప్టెంబర్ 2022 నాడు వస్తుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి చనిపోయిన పూర్వీకులందరికీ తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధం చేస్తారు. మహాలయ అమావాస్య తేదీ మరియు ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం.
మహాలయ అమావాస్య తేదీ, సమయం
మహాలయ అమావాస్య తిథి 25 సెప్టెంబర్ 2022 ఉదయం 3:12 గంటలకు ప్రారంభమై.. 26 సెప్టెంబర్ 2022 ఉదయం 3:23 గంటలకు ముగుస్తుంది. మహాలయ అమావాస్య తర్వాత నవరాత్రులు ప్రారంభమవుతాయి.
మహాలయ అమావాస్య ప్రాముఖ్యత
మహాలయ అమావాస్య పితృ పక్షం చివరి రోజు. ఈ రోజున పాలు, నువ్వులు, కుశ గడ్డి కలిపిన నీటితో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఈ పిండాలను కాకుల కోసం సమర్పిస్తారు. ఈ అమావాస్య నాడు బ్రాహ్మణులకు అన్నదానం లేదా దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. దీంతో వారు సంతోషించి మీపై వరాలు జల్లు కురిపిస్తారు.
పితృ పక్షం శ్రాద్ధ తేదీలు:
ప్రతిపాద శ్రాద్ధ, అశ్వినీ, కృష్ణ ప్రతిపద - 10 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ ద్వితీయ - 11 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ తృతీయ-12 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ చతుర్థి - 13 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ పంచమి - 14 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ షష్ఠి - 15 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ సప్తమి - 16 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ అష్టమి - 18 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ నవమి - 19 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ దశమి - 20 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ ఏకాదశి - 21 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ ద్వాదశి - 22 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ త్రయోదశి - 23 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ చతుర్దశి - 24 సెప్టెంబర్ 2022
అశ్వినీ, కృష్ణ మహాలయ అమావాస్య - 25 సెప్టెంబర్ 2022
Also Read: కన్యారాశిలో మూడు గ్రహాల సంయోగం.. ఈ 4 రాశుల వారిని వరించనున్న అదృష్టం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook