Chandrababu: రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకు..ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు..!

Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయా..? చంద్రబాబు, లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికీ సంకేతం..?

Written by - Alla Swamy | Last Updated : Sep 1, 2022, 04:39 PM IST
  • ఎన్డీఏలోకి టీడీపీ?
  • గతకొంతకాలంగా ప్రచారం
  • తాజాగా చంద్రబాబు క్లారిటీ
Chandrababu: రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే ముందుకు..ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు..!

Chandrababu: ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరే విషయంపై మీడియా ప్రతినిధులు అడగగా మాట్లాడేందుకు సున్నితంగా తిరస్కరిస్తూనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రచారం చేసే వారినే జవాబు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. 

పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండు సార్లు నష్టపోయిందని చెప్పారు. రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని గుర్తు చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. ఇటీవల ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. అప్పటి నుంచి ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతోందన్న ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిసి పనిచేయబోతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత కె. లక్ష్మణ్‌ సైతం స్పందించారు. ఇది కేవలం ప్రచారమేనని కొట్టి పారేశారు. అలాంటి విషయం ఉంటే ముందే చెబుతామని స్పష్టం చేశారు. ఏపీలో సీఎం జగన్ పట్ల వ్యతిరేకత ఉందని..దానికి క్యాష్‌ చేసుకుంటామన్నారు. 2017లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఏపీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్డీఏ నుంచి టీడీపీ ఔట్ అయ్యింది. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. మళ్లీ 2024లో కలిసి పనిచేస్తాయన్న ప్రచారం ఉంది. 

2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేశాయి. మళ్లీ అదే జోడీ రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నో సందర్భాల్లో టీడీపీ, బీజేపీ కలిసి పని చేశాయి. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది. రాష్ట్రాల నాయకత్వంతో సంబంధం లేకుండా నేరుగా బీజేపీ పెద్దలతో చంద్రబాబు మంతనాలు జరుపుతుంటారు. ప్రతిసారి రాష్ట్ర నాయకత్వం ఒప్పుకోకపోయినా..ఢిల్లీ నుంచి పొత్తుల విషయంపై క్లారిటీ వస్తూ ఉంటుంది. ఈసారి అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో పవర్‌లోకి రావాలని యోచిస్తున్న బీజేపీ..టీడీపీతో కలిసి పనిచేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది.

Also read:Asia Cup 2022: సూర్యకుమార్‌ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసలు..అతడిని మూడో స్థానంలో పంపాలన్న మాజీ ప్లేయర్..!

Also read:Jharkhand Crisis: జార్ఖండ్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం..సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News