Rahu grah remedies: ఆస్ట్రాలజీలో రాహువును పాప గ్రహంగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో రాహు గ్రహం అశుభ స్థానం లేదా బలహీనంగా ఉంటే అతడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటాడు. అశుభ రాహు మిమ్మల్ని అనేక మానసిక శారీరక సమస్యలకు గురిచేస్తాడు. దీంతో మీరు ఎందులోనూ విజయం సాధించలేరు. మీ జాతకంలో రాహు బలపడేందుకు అనేక ప్రభావవంతమైన నివారణలు జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
రాహు పరిహారాలు
>> రాహు గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ మీ వద్ద వెండి నాణెం ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో రాహువు బలపడి మీకు మంచి ఫలితాలను ఇస్తాడు.
>> బలహీనమైన రాహువు బలపడాలంటే కుక్కకు బ్రెడ్ తినిపించడం మంచి పని. ఇలా చేయడం ద్వారా రాహువు శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.
>> రాహువును శాంతింపజేయడానికి గంగానదిలో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది.
>> ఇనుప ఉంగరం లేదా బ్రాస్లెట్ ధరించడం కూడా రాహువును బలపరచడానికి మంచి మార్గం.
>> పేదవాడికి సహాయం చేయడం, దానం చేయడం కూడా రాహువు యొక్క దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
>> రాహువు బలహీనంగా ఉన్నవారు నాన్ వెజ్ మరియు మద్యానికి దూరంగా ఉండండి.
Also read: Astro Tips: మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారాలంటే...రోజూ ఈ 5 పనులు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rahu grah remedies: మీ జాతకంలో రాహు బలపడాలంటే.. ఇలా చేయండి!