హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సనోరాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి కొండమీద నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
#SpotVisuals from Himachal Pradesh: Six people died and several injured after a private bus fell into deep gorge near Sanora in Sirmaur district . Police says, 'Rescue operation underway'. pic.twitter.com/jUh1vfx657
— ANI (@ANI) May 13, 2018
Six people died and several injured after a private bus fell into deep gorge near Sanora in Sirmaur district . Police says, 'Rescue operation underway'. #HimachalPradesh pic.twitter.com/lMJIR49EwT
— ANI (@ANI) May 13, 2018
ఇదిలా ఉండగా బారాబంకీలో గత రాత్రి పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. వర్షాల కారణంగా ఓ చెట్టు విరిగి పట్టాలపై పడింది. రైలు చెట్టుమీద నుంచే పోవడంతో అదుపుతప్పి పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని రైల్వే శాఖ తెలిపింది.
Engine of Patna-Kota Express derailed last night after it hit a tree which had fallen on the railway track due to thunderstorm, near Barabanki's Dariyabad; No casualties reported. pic.twitter.com/3MULLGirgh
— ANI UP (@ANINewsUP) May 13, 2018