CJI NV Ramana: హైదరాబాద్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది. పదవి విరమణకు ఒక రోజు ముందు సీజేఐ ఎన్వీ రమణ తీపి కబురు అందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్ జర్నలిస్టులకు న్యాయం జరిగింది. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాల కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
సుదీర్ఘవాదనలు విన్న కోర్టు..జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడి పెట్టకూడదన్నారు సీజేఐ ఎన్వీ రమణ. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి తాను మాట్లాడటం లేదని..ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బంది పడాలని ఈసందర్భంగా ఆయన వ్యాఖ్యనిచ్చారు. రూ.8 వేల నుంచి రూ.50 వేలు జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ జర్నలిస్టులకు వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదన్నారు సీజేఐ. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్లు చేశారని గుర్తు చేశారు. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకునేందుకు తాము అనుమతిస్తున్నామని తేల్చి చెప్పారు. జర్నలిస్టులు వారి స్థలంలో నిర్మాణాలు జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును మరో బెంచ్ ముందు ఉంచాలని ఆదేశించారు సీజేఐ ఎన్వీ రమణ.
Also read:Monkeypox: ఒకేసారి మూడు వైరస్‌లు సోకడం సాధ్యమేనా..శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!
Also read:Liger Movie Review: విజయ్ దేవరకొండ "నత్తి విశ్వరూపం" ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CJI NV Ramana: హైదరాబాద్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్..పచ్చజెండా ఊపిన సీజేఐ ఎన్వీ రమణ..!
హైదరాబాద్ జర్నలిస్టులకు తీపికబురు
గుడ్‌న్యూస్ చెప్పిన సీజేఐ
తక్షణ ఆదేశాలు