Lord Ganesha Favourite Zodiac Signs: వినాయక చవితి మరో ఆరు రోజుల్లో రానుంది. దేశమంతా గణేష్ చతుర్థి (Ganesha Chaturthi 2022) వేడుకలకు ముస్తాబవుతుంది. విగ్రహాల తయారీదారులు ఇప్పటికే వినాయక ప్రతిమలన్నింటినీ సిద్ధం చేశారు. ఈ పండుగను వైభవంగా జరుపుకునేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. పది రోజులపాటు జరిగే ఈ వేడుకలలో గణపతిని (Lord Ganesh) పూజించడం ద్వారా భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, గణేశుడికి మూడు రాశులవారు అంటే చాలా ఇష్టం. వారిపై అతడు వరాల జల్లు కురిపిస్తూనే ఉంటాడు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
బుధ గ్రహం తెలివితేటలకు, శ్రేయస్సుకు కారకుడు మరియు ఇది గణేశుడికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రంలో, బుధుడు శుభప్రదంగా భావించే రాశుల వారిపై గణేశుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.
మేషం (Aries)- మేష రాశి వారికి వినాయకుని కటాక్షం ఉంటుంది. దీంతో ఈ రాశివారు తమ పనిని త్వరగా పూర్తి చేస్తారు మరియు వారు మంచి ఫలితాలను కూడా పొందుతారు. తమ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో పూర్తిచేస్తారు.
జెమిని (Gemini)- మిథునరాశిని పాలించే గ్రహం మెర్క్యురీ. వీరు చాలా తెలివైన వారు మరియు బాగా మాట్లాడతారు. వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. గణేశుడి అనుగ్రహంతో ఈ వ్యక్తులు పనులు చాలా త్వరగా పూర్తవుతాయి.
మకరం (Capricron)- శని దేవుడితో పాటు, గణేశుడు కూడా మకరరాశి ప్రజలపై ప్రత్యేక అనుగ్రహాన్ని కురిపిస్తాడు. దీంతో ఈ వ్యక్తులు ప్రతిపనిలోనూ సులభంగా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు తమ తెలివితేటలు మరియు నైపుణ్యాలతో ఎంతటి కష్టన్నైనా అధిగమిస్తారు. ఈ వ్యక్తులు వారి జీవితంలో చాలా విజయవంతమవుతారు.
Also Read: Venus Transit 2022: సింహరాశిలో శుక్రుడు సంచారం.. 23 రోజులపాటు ఈ రాశులకు కష్టకాలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook