Chia Seeds Benefits: గుండె శరీరంలో ప్రధానమైన భాగం. శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటేనే ప్రాణం ఉంటుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, ఏం తినాలో తెలుసుకుందాం..
శరీరంలోని వివిధ భాగాలకు ధమనుల ద్వారా ఆక్సిజన్, స్వచ్ఛమైన రక్తాన్ని సరఫరా చేయడమే గుండె ప్రదాన విధి. అందుకే గుండెను శరీరంలో అతి కష్టమైన పని నిర్వహించే అంగంగా భావిస్తారు. ఓసాధారణ మనిషి గుండె నిమిషానికి 72-80 సార్లు కొట్టుకుంటుంది. అంటే గంటకు 4800 సార్లు కొట్టుకుంటుంది. అంతటి ముఖ్యమైన గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జంక్ ఫుడ్ తిన్నప్పుడు గుండె పనిచేసే సమయం తగ్గిపోతుంటుంది. అందుకే గుండె ఆరోగ్యం కోసం ఏం తినాలి, ఏం చేయాలో పరిశీలిద్దాం..
చియా సీడ్స్‌తో గుండె ఆరోగ్యం
చియా సీడ్స్ అనేవి ఫ్లెక్స్ సీడ్స్ ఆకారంలో ఉంటాయి. ఈ విత్తనాల్లో ఒమేగా 3 గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజూ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమౌతాయి. ముఖ్యంగా చియా సీడ్స్‌లో కరిగే గుణమున్న ఫైబర్ ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఫలితంగా స్ట్రోక్స్ వంటి సమస్యలు తగ్గుతాయి.
చియా సీడ్స్ అనేవి మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా ఉపయోగం. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చియా సీడ్స్ అద్బుతంగా ఉపయోగపడతాయి. రోజూ చియా సీడ్స్ తీసుకుంటే ఇన్సులిన్ లెవెల్స్ మెరుగౌతాయి. భోజనం తరువాత గ్లాసు నీళ్లతో చియా సీడ్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకుంటాయి.
చియా సీడ్స్‌తో ఫాలూదా చేసి తీసుకోవచ్చు. లేదా ఇతర ఆహార పదార్ధాల్లో వినియోగించవచ్చు. ఒక కప్పు నీళ్లలో చియా సీడ్స్ నానబెట్టి..ప్రతిరోజదూ గ్లాసు నీళ్లతో సేవించాలి. లేదా పాలు, పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో ఒక స్పూన్ చియా సీడ్స్ 20 నిమిషాలసేపు నానబెట్టి..తీసుకోవచ్చు.
Also read: Cholesterol Tips: మందుల్లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించడం ఎలా, సులభమైన చిట్కాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook