Munawar Faruqui: హిందూ సంస్థలు, బీజేపీ నేతల హెచ్చరికలను తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదు. వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇచ్చింది. ఆగస్టు 20 (శనివారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ స్టాండప్ కమెడియన్ షో జరగనుంది. షో కోసం ఇప్పటికే టికెట్ల బుకింగ్ అయిపోయింది. బుక్ మై షో ద్వారా టికెట్లను విక్రయించారు. మునావర్ షో టికెట్ ధరను 499 రూపాయలుగా నిర్ణయించారు. అయితే హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వొద్దని డీజీపీకి బీజేవైఎం ఫిర్యాదు చేసింది. మునావర్ ఫారూఖీ షోపై పలు హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మునావర్ ఫరూఖీ షోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఆయన హైదరాబాద్ కార్యక్రమాన్నిఅడ్డుకొంటామని హెచ్చరించారు.
మునావర్ ఫరూఖీ షో జరిగే హాల్ ను తగలబెడతామని రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. మునావర్ హైద్రాబాద్ కు వస్తే కొట్టి పంపిస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు మునావర్ కు ఎవరూ సహకరించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయినా ఫారూఖీ హైదరాబాద్ వస్తే తాము చేయాల్సింది చేసి తీరుతామని వార్నింగ్ ఇచ్చారు రాజాసింగ్. ఈ నేపథ్యంలో మునావర్ షోకు సర్కార్ అనుమతి ఇస్తుందో లేదో సస్పెన్ష్ నెలకొంది. కాని ఆయన షోకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు హిందూ సంఘాల హెచ్చరికలను భేఖాతరు చేసింది. మునావర్ షోకు అనుమతి ఇవ్వడమే కాదు.. ఆ షోను అడ్డుకుంటామని హెచ్చరించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. మునావర్ షో ముగిసేవరకు రాజాసింగ్ బయటికి రాకుండా పోలీసులు అతని ఇంటిదగ్గర పోలీసులను మోహరించారు.
స్టాండప్ కమెడియన్ గా ఫేమస్ అయిన మునావర్ ఫరూఖీ.. డోంగ్రీ పేరుతో షోలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు. అయితే తన షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సీతాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తీవ్ర దుమారం రేగింది. కర్ణాటకలో మునావర్ షోలను నిషేధించారు. మునావర్ ఫరాఖీకి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు.ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా అనుమతి ఇచ్చింది. తెలంగాణ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు తీవ్రంగా ఫైరవుతున్నారు.
Read Also: TRS Warning: బండి సంజయ్ నాలుక చీరేస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం
Read Also: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి