Liger Movie Censor Report: లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్.. ఆ బూతు డైలాగ్స్, సైగలకు సెన్సార్ కట్

Liger Movie Censor Report : లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండె జంటగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా థియేటర్స్‌లోకి రానుంది. సంచలన చిత్రాలు తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా రచించి, కో ప్రోడ్యూస్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది.

Written by - Pavan | Last Updated : Aug 18, 2022, 10:52 PM IST
Liger Movie Censor Report: లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్.. ఆ బూతు డైలాగ్స్, సైగలకు సెన్సార్ కట్

Liger Movie Censor Report : లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండె జంటగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా థియేటర్స్‌లోకి రానుంది. సంచలన చిత్రాలు తెరకెక్కించిన మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా రచించి, కో ప్రోడ్యూస్ చేసి తెరకెక్కించిన సినిమా ఇది. బాలీవుడ్ లో ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ ఈ సినిమాను హిందీ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు. సినిమా సెట్స్ దశలో ఉన్నప్పటి నుండే ప్రమోషన్స్ విషయంలో తనదైన స్ట్రాటెజీ ప్రదర్శిస్తూ వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలోకొచ్చాకా ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. ప్యాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా లైగర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన లైగర్ ట్రైలర్, రొమాంటిక్ టచ్ ఉన్న సాంగ్స్ సినిమాపై యువతలో మరింత ఆసక్తిని పెంచాయి.

లైగర్ మూవీ రిలీజ్‌కి మరో వారం రోజులే మిగిలి ఉండటంతో నిన్ననే సినిమా సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకుంది. 140 నిమిషాల 20 సెకండ్స్ నిడివి కలిగిన లైగర్ మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీచేసింది. అంతేకాకుండా సినిమాలో పలు సన్నివేశాల్లో ఉపయోగించిన డైలాగ్స్, సైగలపై సెన్సార్ బోర్డ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ముఖ్యంగా ఎఫ్ అనే అక్షరంతో మొదలయ్యే ఇంగ్లీష్ బూతు పదాలు తొలగించడంతో పాటు అభ్యంతరకరంగా ఉన్న కొన్ని సైగలను కనిపించకుండా బ్లర్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్ లైగర్ మూవీ యూనిట్ కి సూచించింది.

Vijay Deverakonda, Puri Jagannadh Liger movie censor report

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన లైగర్ మూవీలో విజయ్ దేవరకొండ ఎమ్ఎమ్ఏ బాక్సర్ ఫైటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. రోనిత్ రాయ్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించనున్నాడు. తనిష్క భగ్చి, విక్రమ్ మాంట్రోస్ లైగర్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేయగా.. సునీల్ కశ్యప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ కెమెరా హ్యాండిల్ చేస్తుండగా.. జునైద్ సిద్ధిఖి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు.

Trending News