Flipkart OnePlus TV: ఫ్లిప్‌కార్ట్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!

Flipkart Offers on OnePlus Y1 32 Inch TV. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా వ‌న్‌ప్ల‌స్‌ వై1 32 ఇంచ్ టీవీ (OnePlus Y1 32 inch HD Ready LED Smart Android TV)పై రూ. 5000 తగ్గింపు ఆఫర్ ఉంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 18, 2022, 03:59 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై భారీ తగ్గింపు
  • రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ
  • వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై రూ. 5000 తగ్గింపు
Flipkart OnePlus TV: ఫ్లిప్‌కార్ట్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై భారీ తగ్గింపు.. రూ. 15 వేలకే 32 ఇంచ్ టీవీ!

Flipkart OnePlus Y1 TV Offers: ప్రముఖ మొబైల్ సంస్థ 'వ‌న్‌ప్ల‌స్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లో వ‌న్‌ప్ల‌స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో అద్భుతాలు సృష్టించిన వ‌న్‌ప్ల‌స్.. స్మార్ట్ టీవీలను కూడా తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ మాదిరే స్మార్ట్ టీవీలకు కూడా భారత మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం చాలా సిరీస్‌లు అందుబాటులో ఉన్నా.. వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్ ఉంది. 

కామర్స్ దిగ్గజం ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 'టాప్ డీల్స్' సేల్ ఉంది. ఈ సేల్‌లో భాగంగా వ‌న్‌ప్ల‌స్‌ వై1 32 ఇంచ్ టీవీ (OnePlus Y1 32 inch HD Ready LED Smart Android TV)పై రూ. 5000 తగ్గింపు ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీ 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 19,999గా ఉంది. 'టాప్ డీల్స్' సేల్‌లో భాగంగా 25 శాతం తగ్గింపుతో (రూ. 5000) ఈ టీవీ రూ. 14,999లకు అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్.

వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై బ్యాంక్ ఆఫర్‌ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ (₹2,500/month) ఆఫర్ కూడా ఉంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 9000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. రూ. 14,999 వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీని కేవలం రూ. 5,999లకి సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్‌ టీవీ కండిషన్ బాగుంటేనే రూ. 9000 వర్తిస్తాయి. 

వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీ 32 ఇంచ్ స్పెసిఫికేషన్లు:
# 32 ఇంచ్ హెచ్‌డీ రెడీ ఎల్‌ఈడీ
# 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమోరీ
# ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం
# హెచ్‌డీ రెడీ 1366 x 768 పిక్సల్స్ 
# 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్
# రిఫ్రెష్ రేట్ 60 Hz

Also Read: బూతులతో రెచ్చిపోయిన హీరో నాని.. ఈషా రెబ్బ కూడా తగ్గేదెలే అంటూ..!

Also Read: Crime News: తండ్రితో పెళ్లికి నిరాకరించిందని యువతి బట్టలు విప్పి, జుట్టు కత్తిరించి బూట్లు నాకించిన వైనం.. ఎక్కడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

Trending News