Disha Patani cryptic post goes viral amid breakup rumours with Tiger Shroff: బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటాని బ్రేకప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత 6 ఏళ్ల నుంచి ప్రేమలో ఈ స్టార్ జోడి.. ఇప్పుడు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. టైగర్, దిశా జంటగా పార్టీలు, వెకేషన్స్ అంటూ తెగ తిరిగారు. ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇక పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అనుకున్న సమయంలో వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట.
టైగర్ ష్రాఫ్, దిశా పటాని విడిపోవడానికి 'వివాహం' కారణమని ఓ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా సిద్ధంగా ఉన్నా.. టైగర్ మాత్రం రెడీగా లేడట. ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో నిలదొక్కుకుంటున్న టైగర్.. కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ సమయంలో వివాహం చేసుకోవడం అతడికి ఇష్టం లేదట. ఇదే విషయాన్ని దిశాకు చెప్పాడట. దీంతో టైగర్ ష్రాఫ్‌తో దిశా బ్రేకప్ చేసుకుందట.
టైగర్ ష్రాఫ్‌తో బ్రేకప్ పుకార్ల మధ్య దిశా పటాని సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. 'మీకు తెలిసిన ప్రతి దానిపై మీరు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుందని ఎవరూ చెప్పకపోయినా సరే.. మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి' దిశా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే టైగర్, దిశా సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని వారు అంటున్నారు. దిశా ప్రతిరోజూ టైగర్ ఇంటికి వెళ్లి అతడి కుటుంబంతో మాట్లాడుతున్నారని సన్నిహితులు చెప్పుకొచ్చారు.
Also Read: బర్త్ డే సందర్భంగా మొసలికి కేక్ పెడదామనుకుంది.. మూల్యం చెల్లించుకుంది!
Also Read: ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. కత్రినా, ప్రియాంకతో ఒక్కసారైనా..: నాగ చైతన్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook