Rohit Sharma: ఆసియా కప్‌లో జయసూర్య, సచిన్ రికార్డు బద్ధలు కానుందా..? రోహిత్ జోరు కొనసాగిస్తాడా..?

Rohit Sharma: త్వరలో ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. టోర్నీకి ముందు భారత ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Written by - Alla Swamy | Last Updated : Aug 15, 2022, 06:50 PM IST
  • త్వరలో ఆసియా కప్‌
  • తొలి మ్యాచ్‌లో పాక్‌తో భారత్ ఢీ
  • మరో రికార్డుకు చేరువలో రోహిత్
Rohit Sharma: ఆసియా కప్‌లో జయసూర్య, సచిన్ రికార్డు బద్ధలు కానుందా..? రోహిత్ జోరు కొనసాగిస్తాడా..?

Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. ఈనెల 18 నుంచి భారత జూనియర్ జట్టు..జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఈసిరీస్‌ ముగియగానే ఆసియా కప్ మొదలుకానుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. యూఏఈ వేదికగా ఈనెల 27 నుంచి ఆసియా కప్‌ మొదలుకానుంది. 

తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఈనెల 28న దాయాది దేశాలు భారత్, పాక్‌ ఢీకొన్ననున్నాయి. ఇప్పటికే పలు ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గత టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా జట్టు భావిస్తోంది. కొత్త సారధి రోహిత్ శర్మ ఆధ్వర్యంలో భారత జట్టు మంచి ఊపు మీద ఉంది. ఈమ్యాచ్‌లో టీమిండియాదే విజయమని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

భారత జట్టు ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, కోహ్లీ టచ్‌లోకి వస్తే పాక్‌కు ఓటమి తప్పదని అంటున్నారు. ఈక్రమంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కోసం పలు రికార్డులు వేచి చూస్తున్నాయి. ఆసియా కప్‌లో అతడు రాణిస్తే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును అధికమించనున్నాడు. ఆసియా కప్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో సచిన్ 971 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 883 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 89 పరుగులు సాధిస్తే సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. ఈక్రమంలో మరో 117 పరుగులు సాధిస్తే భారత్ తరపున ఆసియా కప్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్ చరిత్ర సృష్టించనున్నాడు. మొత్తంగా మెగా టోర్నీలో వెయ్యి పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానానికి చేరుకుంటాడు. అత్యధిక పరుగుల వీరుల్లో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 12 వందల 20 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

మరో శ్రీలంక సీనియర్ ప్లేయర్ కుమార సంగక్కర వెయ్యి 75 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈజాబితాలో తొలి స్థానంలోకి రోహిత్ శర్మ వెళ్లాలంటే ఇంకా 338 పరుగులు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఆసియా కప్‌లో భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్ శర్మ ఫామ్ ఇలాగే కొనసాగితే ఈటోర్నీలో జయసూర్య రికార్డుకు బ్రేక్ పడనుంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో రోహిత్ 27 మ్యాచ్‌లు ఆడి 883 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్‌ సెంచరీలు, ఓ సెంచరీ ఉంది. 

Also read:Bharat Biotech: భారత్ బయోటెక్‌ నుంచి మరో వ్యాక్సిన్..క్లినికల్ ట్రయల్స్ సూపర్ సక్సెస్..!

Also read:Chandrababu: మరో విజన్ ప్రకటించిన చంద్రబాబు..విజన్ 2047లో విశేషాలు ఇవిగో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News