Weight Loss Tips: ఎలాంటి డైట్‌ చేయకుండా ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు.. ఈ చిట్కా మీకు తెలుసా..?

Weight Loss In 7 Days:  ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని తీవ్ర శరీర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీర బరువు పెరగడం.. స్థూలకాయం వంటి తీవ్ర సమస్యలకు గురికావడం విశేషం. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో రొటీలను ఆహారంగా తీసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2022, 11:14 AM IST
  • రోజూవారి ఆహారంలో ఫైబర్ ఫుడ్‌ తినండి
  • ఈ ఆహారాలను తీసుకుంటే
  • సులభంగా బరువు తగ్గుతారు
 Weight Loss Tips: ఎలాంటి డైట్‌ చేయకుండా ఇలా సులభంగా బరువు తగ్గొచ్చు.. ఈ చిట్కా మీకు తెలుసా..?

Weight Loss In 7 Days:  ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని తీవ్ర శరీర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీర బరువు పెరగడం.. స్థూలకాయం వంటి తీవ్ర సమస్యలకు గురికావడం విశేషం. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో రొటీలను ఆహారంగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారనే సమాచారంతో అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. కానీ ఇలా చేయడం సరి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మంచి ఆహారాలను తీసుకుంటూ బరువును ఎలా నియంత్రించుకోవాలో నిపుణులు పేర్కొన్నారు. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఆహారంపై ప్రత్యక శ్రద్ధవహించాలి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సులభంగా ఏ ఆహారాలను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారం తగ్గించకుండా బరువు తగ్గడం ఎలానో మీకు తెలుసా..?

ఫైబర్ ఫుడ్‌ తినండి:

జీర్ణ వ్యవస్థ మెరుగు పడాలంటే.. తప్పకుండా మంచి ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆకలి నియంత్రించి.. బరువును సులభంగా తగ్గిస్తుంది. అయితే ఫైబర్‌, పోషకాలు అధిక పరిమాణంలో ఉండే.. పండ్లు, కూరగాయలను రోజూ ఆహారంగా తీసుకోవాలి.

ప్రోటీన్స్‌ రిచ్‌ ఫుడ్‌:

మనం రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్‌ ఉంటాయి. కానీ మనం తరచుగా తీసుకునే ఆహారంలో కేవలం కొన్ని రకాల ప్రోటీన్స్‌ మాత్రమే ఉంటాయి. కావున శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలున్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా ఈ ఆహారాలను తీసుకు శరీరం, ఎముకలు దృఢంగా మారుతాయి.

అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మేలు:

ప్రస్తుతం చాలా మంది బయట లభించే జంక్‌ ఫుడ్‌ను తీసుకుంటారు. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయని ఎవరికీ అవగాహన లేదు. తరచుగా పిజ్జా, బర్గర్‌లు, చిప్స్, ఫ్రెంచ్, శీతల పానీయాలను తీసుకుంటున్నారు. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్ర శరీర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆహారాలను బాగా నమిలి తినండి:

 బిజీ షెడ్యూల్‌ కారణంగా చాలా మంది ఆహారాలను తీసుకునే క్రమంలో స్పీడ్‌గా నమల కుండా తింటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారీ తిసే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున బరువు తగ్గాలనుకునే వారు ఆహారాన్ని నమిలి తినడం చాలా మంచిది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం

Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్.... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News