Airtel 5G services: 5G వేలం బిడ్డింగ్‌లో పైచేయి సాధించేందుకు టెలికాం ఆపరేటర్స్‌లో దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ ఎక్కువగా పోటీపడగా ఆ తర్వాత వొడాఫోన్ ఐడియా, కొత్తగా టెలికాం సెక్టార్‌లోకి ఎంట్రీ ఇస్తున్న గౌతం అదాని వంటి వాళ్లు పోటీపడ్డారు. దీంతో దేశంలో ఏయే టెలికాం ఆపరేటర్స్ ఎప్పుడు 5G సేవలు ప్రారంభిస్తారా అనే ఉత్కంఠ 5G కోసం వేచిచూస్తున్న మొబైల్ యూజర్స్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌టెల్ 5G సేవలపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విఠల్ క్లారిటీ ఇచ్చారు.
ఎయిర్ టెల్ 5G సేవలపై భారతి ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విఠల్ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో మొబైల్ సేవలు చాలా తక్కువకే లభిస్తున్నాయని.. వీటి ధరలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని విఠల్ వ్యాఖ్యానించడం గమనార్హం. దేశంలో ఈ ఆగస్టులో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించి త్వరలోనే దేశం మొత్తానికి సేవలు విస్తరింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
2024 మార్చి నెలకల్లా దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలతో పాటు ముఖ్యమైన అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5G సేవలు అందుబాటులోకి వస్తాయని విఠల్ స్పష్టంచేశారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా మొత్తం 5 వేల నగరాలకు 5జీ సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎయిర్‌టెల్ కంపెనీ చరిత్రలోనే ఇదో అతిపెద్ద ముందడుగుగా నిలుస్తుందని తెలిపారు. ఇటీవల జరిగిన 5జీ వేలంలో చురుకుగా పాల్గొన్న ఎయిర్‌టెల్.. 3.5 GHz, 26 GHz బ్యాండ్స్‌లో 19,867.8 MHz ఫ్రీక్వెన్సీలను సొంతం చేసుకుంది. ఇందుకోసం ఎయిర్‌టెల్ 43,040 కోట్లు వెచ్చించింది. స్టాండ్ఎలోన్ 5జీ సేవలతో పోల్చుకుంటే.. నాన్-స్టాండ్ఎలోన్ 5G సేవలతోనే అధిక ప్రయోజనాలు ఉన్నాయని విఠల్ అభిప్రాయపడ్డారు. విస్కృత స్థాయిలో కవరేజీ, అధిక సంఖ్యలో డివైజెస్ ఉండటమే అందుకు కారణం అని విఠల్ వివరించారు.
Also Read : Mukesh Ambani Salary : ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా..రిలయన్స్ వార్షిక నివేదికలో ఏముంది..?
Also Read : Car Sales on Discount : కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆ కంపెనీల కార్లపై డిస్కౌంట్ ఆఫర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P2DgvH
Apple Link - https://apple.co/3df6gDq
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook