Telangana SI Prelims Exam 2022 on August 7th: తెలంగాణ రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా.. ఆగష్టు 7న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం జరగనున్న ఈ పరీక్షకు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో 503, రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 35 కలిపి మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలతో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ గడువు ముగిసింది. 554 ఎస్సై పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎగ్జామ్ ఉదయం 10 గంటలకు ఆరంభం అవుతుంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి గంటల ముందే చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయిన ఒక్క నిమిషం లేటు అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు:
# అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి గంటల ముందే చేరుకోవాలి.
# హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ4 సైజ్‌లో రెండు వైపులా (హాల్‌టికెట్ ఒకవైపు, వెనుక వైపు సూచనలు) ప్రింట్ అవుట్ తీసుకోవాలి. కలర్లో ప్రింట్ అవసరం లేదు.
# ప్రింట్ అవుట్ తీసుకున్న ఏ4 సైజ్‌లో ఎడమవైపు కింది భాగంలోని బాక్స్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. గుండు పిన్నులతో కాకుండా గమ్ మాత్రమే ఉపయోగించాలి.
# దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటో అతికించాలి.
# పరీక్ష కేంద్రంలోకి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే అనుమతిస్తారు.
# పరీక్ష కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో హాజరు ఉంటుంది. అభ్యర్థులు చేతులకు మెహందీ, టాటూలు ఉంటే బయోమెట్రిక్ సరిగా పనిచేయదు.
# మొబైల్స్, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, రిస్ట్‌వాచ్, వ్యాలెట్ లాంటి వస్తువులకు అనుమతి లేదు.
# అభ్యర్థులు ఏమైనా వస్తువులు వెంట తీసుకువస్తే పరీక్షా కేంద్రాల్లో దాచేందుకు ఎలాంటి క్లాక్ రూంలు ఉండవు.
# ఎగ్జామ్ బుక్‌లెట్‌లో ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి.
# బుక్లెట్పై ఎలాంటి రాతలు రాయకూడదు.
Also Read: Today Gold Price August 6: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!
Also Read: AP TET 2022: ఏపీలో నేటి నుంచే టెట్.. అభ్యర్థులు పాటించాల్సిన గైడ్‌లైన్స్ ఇవే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook