IND vs WI: విండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అలరించాడు. 44 బంతుల్లో 64 పరుగులు చేశారు. ఇందులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఐతే మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో తక్కువ స్కోర్ నమోదు అవుతుందని అంతా భావించారు. ఈక్రమంలో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్..టీమిండియాను ఆదుకున్నాడు. 19 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో హొసిన్ ఒక వికెట్, జొసెఫ్ రెండు వికెట్లు తీశారు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్..ఆదిలో దాడిగా ఆడింది.
ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన దినేష్ కార్తీక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. సోమవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
.@DineshKarthik played a stroke-filled knock of 41* off 19 balls & bagged the Player of the Match award as #TeamIndia beat West Indies in the first T20I. 👏 👏
Scorecard ▶️ https://t.co/qWZ7LSCo82 #WIvIND pic.twitter.com/lZDxvVUVWS
— BCCI (@BCCI) July 29, 2022
Also read:KTR: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి
Also read:Chandrababu: టీడీపీతోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి..సీఎం జగన్‌కు అంతా సీన్ లేదన్న చంద్రబాబు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook