Sravana Remedies 2022: శ్రావణ మాసం పూర్తిగా శివుడికి అంకితం చేయబడింది. ఎందుకంటే ఈ మాసంలో (Sravana Masam 2022) శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటే.. సృష్టిని సంరక్షించే బాధ్యతను పరమేశ్వరుడు (Lord Shiva) తీసుకుంటాడు. అందుకే ఈ మాసంలో భక్తులు శివారాధన ఎక్కువగా చేస్తారు. శివుడు అనుగ్రహించి వీరి కోరికలు నెరవేరుస్తాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆస్ట్రాలజీ కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండండి
శ్రావణ మాసం సాత్విక మాసం కాబట్టి కనీసం ఈ మాసంలో అయినా తామసిక ధోరణిని విడనాడి సాత్వికత వైపు పయనించాలి. సాత్వికత జీవితాంతం మంచిదే అయినప్పటికీ.. దానిని పాటించడం కష్టమైతే దానిని కనీసం శ్రావణ మాసంలోనైనా ఆచరించండి. మాంసాహారం, మద్యం మొదలైన వాటిని తామస ఆహారంగా భావిస్తారు. కాబట్టి శ్రావణ మాసంలో వాటిని విడిచిపెట్టి సాత్వికంగా ఉండాలనే నియమాన్ని పెట్టుకోండి. ఈ మాసంలో సాధారణమైన, జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తినండి.
నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టండి
కొందరికి చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఆవేశపడటం కనిపిస్తుంది. అంతేకాకుండా నెగిటివిటీ అనేది వారి ఆలోచనల్లో ఎప్పుడూ ఉంటుంది. ఈ మాసంలో దానిని విడిచిపెట్టి..పూర్తి ఏకాగ్రతతో శివారధనలో లీనమవ్వండి. మీ మనస్సులో ఆనందం మరియు పరిపూర్ణత యొక్క అనుభూతిని మేల్కొల్పండి.
పెద్దలను గౌరవించండి
శ్రావణ మాసంలో పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను, పండితులను గౌరవించాలి. వారిని ఎప్పుడూ దూషించకూడదు, పరుషమైన మాటలు మాట్లాడకూడదు. వారిని అవమానించే విధంగా మాట్లాడితే..మీరు ఎన్ని పూజలు చేసిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు శివుడి ఆగ్రహానికి గురవుతారు.
ఎద్దుకు సేవలు చేయండి
శివుని వాహనం నంది. ఈ మాసంలో ఎద్దుకు మేత పెట్టడం, నీటిని అందించడం మెుదలైన సేవలు చేయడం ద్వారా మీరు శివుడి అనుగ్రహం పొందవచ్చు. ఎద్దుతో హింస చేయరాదు.
Also Read: చాలా ఏళ్ల తర్వాత ఒకేరోజు శ్రావణ శివరాత్రి, మంగళగౌరీ వ్రతం.. శుభ ముహూర్తం ఇదే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook