సాయిధరమ్ 'తేజ్' మూవీ టీజర్ (వీడియో..)

హీరో సాయిధరమ్ తేజ్ 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్‌తో ఒక చిత్రంలో నటిస్తున్నాడు.

Last Updated : May 1, 2018, 01:28 PM IST
సాయిధరమ్ 'తేజ్' మూవీ టీజర్ (వీడియో..)

హీరో సాయిధరమ్ తేజ్ 'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్‌ డైరెక్షన్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ మూవీ మేక‌ర్స్  సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీకి 'తేజ్ ఐ ల‌వ్ యూ' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవ‌లే చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కేఎస్ రామారావు ఈ మూవీకి నిర్మాత‌. ఈ మూవీ షూటింగ్ శ‌రవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వర‌న్ న‌టిస్తోంది. ఈ రోజే ఈ మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని ఇదే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టాక్. ఈ టీజర్ వీడియోను మీరూ చూడండి.

కె.ఎస్.రామారావు చిత్ర విశేషాలు తెలియజేస్తూ, నవతరం ప్రేమికుడిగా సాయిధరమ్‌ తేజ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని, అనుపమ పరమేశ్వరన్ నటన ఆకట్టుకుంటుందని వెల్లడించారు. దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ, ఇది హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రం అన్నారు. గత కొంతకాలంగా రోటీన్‌ ఫార్ములా చిత్రాలతో ఫెయిల్యూర్స్‌ చవిచూస్తున్న ఈ సుప్రీం హీరోకు లవ్‌ స్టోరీల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌.. హిట్‌ అందిస్తాడేమో చూద్దాం.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Trending News