Srisailam Dam: తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గరిష్ట నీటిమట్టానికి చేరువైంది. జూలై మూడో వారంలోనే శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారడం అరుదుగా జరుగుతుందంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా శనివారం ఉదయానికి డ్యాంలో నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలు గా ఉంది.
శ్రీశైలం పూర్తిగా నిండటంతో డ్యామ్ మూడు గేట్లను ఎత్తారు. ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కృష్ణమ్మకు పూజలు చేసి డ్యామ్ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. 6, 7, 8 గేట్లను 10 అడుగల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి లక్షా 15 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.మూడు గేట్ల ద్వారా 58వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ గట్టు 27వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32 వేల క్యూసెక్కులు నీటిని వదిలి విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో పర్యాటకులు పోటేత్తుతున్నారు. డ్యాం అందాలు చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. డ్యాం గేట్లు ఎత్తనుండటంతో శ్రీశైలంలో భద్రత పెంచారు పోలీసులు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తోంది. శనివారం డ్యామ్ గేట్లు తెరిచి నీటి విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి రావద్దని సూచించారు.
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Srisailam Dam:జూలైలోనే నిండిన శ్రీశైలం.. డ్యాం మూడు గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి
నిండుకుండలా శ్రీశైలం
డ్యాం గేట్లు ఓపెన్
పర్యాటకుల సందడి