CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాజకీయ వ్యూహాల్లో దిట్ట అంటుంటారు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్ఠం. అదే సమయంలో ఆయన ఏం చేసినా దానికో పొలిటికల్ లెక్క ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఆయన తీసుకునే నిర్ణయాలు ఇతర పార్టీలకు పరేషాన్ చేస్తాయి. సొంత పార్టీ కేడర్ ను ఆయోమయంలో పడేస్తాయి. ఇదే ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సమస్యగా మారిందని అంటున్నారు. కేసీఆర్ యూటర్న్ లతో ఆయనతో కలిసి నడవాలనకున్న పల ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తీసుకున్న స్టాండ్.. విపక్షాల కూటమిని పరేషాన్ చేస్తోంది.
జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ముక్త బీజేపీ నినాదం ఇస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ను దూరం పెడుతున్నారు. మళ్లీ కొన్న సార్లు ఆ పార్టీతో కలిసి వేదిక పంచుకుంటున్నారు. విపక్షాల కూటమి విషయంలో రోజుకోలా వ్యవహరిస్తూ ఎవరికి అర్ధం కాకుండా మిగిలిపోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు పోటీగా విపక్షాలు యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ కూడా సిన్హాకు మద్దతు ఇచ్చింది. అయినా సిన్హాకు సపోర్ట్ చేశారు కేసీఆర్. ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో కలిసి హాజరయ్యారు. సిన్హా ప్రచారంలో కోసం హైదరాబాద్ వస్తే నానా హంగామా చేశారు. ఆ సభలోనే బీజేపీని తీవ్రస్తాయిలో టార్గెట్ చేశారు. అయితే కొన్ని రోజులకే కేసీఆర్ స్టాండ్ మళ్లీ మారిపోయింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమి అభ్యర్థికి సంపూర్ణంగా సపోర్ట్ చేసిన సీఎం కేసీఆర్.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలను ఏకం చేస్తారనే ప్రచారం సాగింది. కాని ఉప రాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ యూటర్న్ తీసుకున్నారు కేసీఆర్.వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్ బరిలో నిలవగా.. విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ ఆల్వాను దింపాయి. అయితే ప్రెసిడెంట్ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన కేసీఆర్.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం విపక్షాలకు షాకిచ్చారు. మార్గరేట్ ఆల్వాకు మద్దతు విషయంలో సైలెంట్ గా ఉన్నారు. కాంగ్రెస్ నేత అయిన మార్గరేట్ ఆల్వాకు మద్దతు ఇవ్వకూడదని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ తటస్థంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన సిన్హాకు మద్దతు ఇచ్చిన కేసీఆర్.. మార్గరేట్ ఆల్వాకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
కేసీఆర్ తీరుతో విపక్ష పార్టీల నేతలు గందరగోళానికి గురవుతున్నాయి. అయితే గులాబీ లీడర్ల మాత్రం తమకు పూర్తి స్పష్టత ఉందంటున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా టీఎంసీ పార్టీ నేత అని చెబుతున్నారు.అందుకే ఆయనకు మద్దతు ఇచ్చామంటున్నారు. మార్గరేట్ ఆల్వా కాంగ్రెస్ పార్టీ నాయకురాలని.. అందుకే తాము సపోర్ట్ చేయడం లేదని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో తమకు బీజేపీ ఎంత ప్రత్యర్థో.. కాంగ్రెస్ కూడా అంతేనంటున్నారు కారు పార్టీ లీడర్లు. మరోవైపు కేసీఆర్ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల కూటమికి మద్దతు ఇవ్వకపోవడం వెనుక ఈడీ కేసుల భయం ఉందనే వాదనలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈడీ స్పెషల్ టీమ్ లో తెలంగాణలో తిరుగుతున్నాయని తెలుస్తోంది. గత ఎనిమిది ఏళ్లలో తెలంగాణలో అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. ఈ కేసుల భయంతోనే విపక్షాల కూటమికి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం లేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
Also read:GVL on Polavaram: ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం పూర్తి తధ్యం..జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..!
Also read:Corona Updates in India: దేశంలో కోరలు చాస్తున్న కరోనా వైరస్..తాజాగా కేసులు ఎన్నంటే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook