Tulsi And Black Pepper Drink: వర్షాకాలంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చలి తీవ్ర కూడా పెరిగే అవకాశాలుకూడా అధికం. కావున వాతావరణంలో మార్పుల వల్ల తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలు. లేకుంటే వైరల్ ఫివర్, దగ్గు జలుబు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నాయి. కానీ వీటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి. అయితే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి నల్ల మిరియాలు, తులసితో చేసిన డికాక్షన్ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ టీలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి దూరం చేస్తుంది. అయితే ఇది శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతుందో తెలుసుకుందాం..
కషాయంలా తయారు చేసుకోండి:
ఈ డికాక్షన్ చేయడానికి.. ముందుగా ఒక పాత్రలో నీటిని మరిగించాలి. తురిమిన అల్లం, లవంగాలు, ఎండుమిర్చి, దాల్చినచెక్క వేసి బాగా మారిగించాలి. ఈ మరిగే క్రమంలో ఒక దానిలో తులసి చూర్ణం వేసి బాగా మరిగించాలి. మీడియం మంట మీద ఉడికించి.. సగం గ్లాస్ అయ్యాక వడపోసి, తేనె వేసి వేడిగా సర్వ్ చేయాలి.
టీ ఎలా తయారు చేయాలి:
మీరు టీ త్రాగడానికి ఇష్టపడితే, మీరు తులసి మరియు నల్ల మిరియాలు తో టీ సిద్ధం చేయవచ్చు. ఇందుకోసం టీలో ఎండుమిర్చి, తులసి వేసి బాగా మరిగించాలి. దీన్ని వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ శరీరానికి అనేక రకాల పోషక విలువలు లభిస్తాయి. కావున వాన కాలంలో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టీని తాగండి.
Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..
Also Read: Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలివే..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook